కర్నాటకను కొద్ది రోజులుగా కుదిపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్రప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని తీసుకున్ననిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ఎం ఎల్ ఏల ఫోన్లు టాప్ చేశారని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య ఆరోపణలుచేయడం వల్లనే తాను కేసును సిబిఐకి అప్పగిస్తున్నానని ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. సి ఎం వ్యాఖ్యలపై సిద్దరామయ్యమాట్లాడుతూ ఇదే కాదు నేను ఆపరేషన్ కమలంపై కూడా సిబిఐ విచారణ కోరాను ముందు దానిపై విచారణ జరిపించండి అని వ్యాఖ్యానించారు. సిబిఐతో కాకపోతే డోనాల్డ్ ట్రంప్ ను అడిగి అమెరికాతో విచారణ చేయించుకోమనా కుమారస్వామి వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కుమారస్వామిని ఇరుకునపెట్టేలా ట్యాపింగ్ కేసుల దర్యాప్తును కేంద్ర ఏజెన్సీ సీబీఐకి అప్పగించనున్నట్లు సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారమే సీబీఐకి లెటర్ రాస్తానని చెప్పారు. కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో పొలికల్ క్రైసిస్ తలెత్తిన సందర్భంలో నాటి సీఎం కుమారస్వామి బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు, ఇంకొందరు అధికారుల ఫోన్లు ట్యాప్ చేయించారనే ఆరోపణలొచ్చాయి. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి, రాజీనామాలు వెనక్కి తీసుకోకుంటే ఆడియో క్లిప్స్ బయటపెడతానని కుమారస్వామి బెదిరించినట్లు రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఏహెచ్ విశ్వనాథ్(జేడీఎస్) ఆరోపించారు. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ఓ అధికారితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా సంచలనం రేపింది. ఫోన్ ట్యాపింగ్స్పై సీబీఐ ఎంక్వైరీని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే గతంలోలా సీబీఐని బీజేపీ తన సొంతానికి వాడుకోవద్దని, వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని బీజేపీలోకి చేర్చుకున్న‘ఆపరేషన్ కమల్’పైనా ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్ లీడర్ సిద్దరామయ్య కోరారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధంలేదని, కొన్ని లోకల్ టీవీ చానెల్స్ పనిగట్టుకుని ప్రచారం చేశాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ‘‘సీబీఐతో కాకుంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీతోనైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిర్యాదుచేసి, ఆయన తరఫున ఎవరితోనైనా దర్యాప్తు చేయించినా పర్వాలేదు’’అని కుమారస్వామి మండిపడ్డారు.
previous post