32.2 C
Hyderabad
May 8, 2024 19: 14 PM
Slider ముఖ్యంశాలు

నరసరావుపేట పట్టణంలో కదం తొక్కిన తెలుగు రైతులు

#TDPnarasaraopet

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ట్రాక్టర్, ఎద్దుల బండ్లతో తెలుగు రైతన్నలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సత్తెనపల్లి రోడ్ మీదుగా మల్లమ్మ సెంటర్, గాంధీ చౌక్, గడియారం స్తంభం సెంటర్, మునిసిపల్ కార్యాలయం మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.

అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ర్యాలీలో దారి పొడవునా పలు నినాదాలు చేశారు.

పన్నుల రూపంలో భారం వేస్తున్న మోడీ, జగన్ ప్రభుత్వాలను  ప్రజలు క్షమించరని వారన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్న మోడీ ప్రభుత్వనికి   ప్రజలు సరైన సమయంలో సారైనా సమాధానం చెబుతారని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ప్రతిభ వంతుల రాష్ట్ర మాజీ టీడీపీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అలాగే సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్ మద్దతు తెలియజేశారు.

అదేవిధంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కడియాల రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షులు వెన్నా బాలకోటి రెడ్డి, నరసరావుపేట మండలం టీడీపీ అధ్యక్షులు విస్వెస్వరావు, నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షరాలు దాసరి ఉదయశ్రీ, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి జాన్నవి, నరసరావుపేట పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షరాలు కదం నాగ జ్యోతి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు, నరసరావుపేట నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు కొల్లి వెంకటేశ్వర్లు,

నరసరావుపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మేత కోటి రెడ్డి, నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి,నరసరావుపేట పార్లమెంట్ కార్యదర్శి కొట్టా కిరణ్, ముస్లిం మైనారిటీ నాయకులు మన్నన్ షరీఫ్, యార్డు వలి, బడే బాబు, ఖాలీల్, రఫీ, ఆయా గ్రామాల తెలుగు రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పోలీసులకు –  నాయకులు,కార్యకర్తలకు పది నిమిషాలు తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు

Related posts

అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Satyam NEWS

మంత్రి పువ్వాడ ను కలిసిన ట్రైనీ ఐ‌పి‌ఎస్

Murali Krishna

వనపర్తికి వన్నె తెచ్చిన బిసి నేతలకు తీరని అవమానం

Satyam NEWS

Leave a Comment