27.7 C
Hyderabad
April 30, 2024 08: 07 AM
Slider వరంగల్

భవన నిర్మాణం సంక్షేమ మండలి పాలకమండలిని నియమించాలి

#mulugu

భవన నిర్మాణం సంక్షేమ మండలి పాలకమండలిని నియమించాలి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి కి పాలకమండలి లేకపోవడం వల్ల సెస్ రూపంలో వస్తున్న నిధులు మొత్తం పక్కదారి పడుతున్నాయని ఏ ఐ టి యు సి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల రవీందర్ అన్నారు.

ములుగు మండలం విశ్రాంత ఉద్యోగుల భవనం లో నేడు జరిగిన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జక్కుల ఐలయ్య ఈ సమావేశానికి అధ్యక్ష వహించారు. ఈ సందర్భంగా జంపాల రవీందర్ మాట్లాడుతూ కార్మికులకు నెలలోపు రావాల్సిన క్లయిమ్ లు రెండు సంవత్సరాలు అయినా అందడం లేదని అన్నారు.

దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులను సొంతానికి వాడుకున్నదని అన్నారు. ఆ నిధులను బోర్డు కు జమ చేసి  సభ్యులకు సకాలంలో సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికుల పింఛన్ అందించాలని అలాగే సభ్యుల నమోదు వయసును 80 సంవత్సరాలకు పెంచాలని ఆయన కోరారు.

అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఏ సి ఎల్, డి సి ఎల్, కార్యాలయాలు,ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి నరసయ్య, జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు మాతంగి శ్యాంసుందర్, జక్కుల ఐలయ్య, కార్మికులు నాంపల్లి స్వామి, నాంపల్లి శంకర్, కొలగాని అశోక్, అమ్మ రాధిక, దయ్యాల రాజమ్మ, పైడిపాల కుమారస్వామి, వాగవత్, రాజు, గద్దల శంకర్, దొడ్డ లింగమూర్తి, బోయిని సదయ్య, పోరిక శ్రీను, సుండి అచ్చయ్య, కొత్తూరు సారంగం, బైకని రవి, దూలం రమేష్, కారం సారంగం, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం ములుగు మండలం కన్వీనర్, గా నాంపల్లి స్వామి ని, కో కన్వీనర్లు గా, దొడ్డ లింగమూర్తి, బోయిని సదయ్య, మాతంగి శ్యాంసుందర్, జక్కుల ఐలయ్య, కొలగాని అశోక్, Go సుండి అచ్చయ్య తో పాటుగా ఇన్చార్జిలుగా, నాంపల్లి శంకర్, కొక్కుల రాజేందర్ లను ఎన్నుకున్నారు.

Related posts

కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండాలి

Satyam NEWS

రాప్తాడులో పెరిగిపోతున్న రాజకీయ వేడి

Satyam NEWS

అగ్ని సాక్షిగా కుదిరిన స్నేహ బంధం

Satyam NEWS

Leave a Comment