February 28, 2024 08: 32 AM
Slider ముఖ్యంశాలు

జగన్ కోసం అసంబద్ధమైన సినిమాలు తీస్తున్న సైకో రామ్ గోపాల్ వర్మ

#shakeelareddy

బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం ఫకీలా రెడ్డి ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి రాంగోపాల్‌వర్మ చేత సైకో జగన్‌ ‘వ్యూహం’ పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించారని, రాంగోపాల్‌వర్మ ఒక సైకో. అతడిని మించిన మరో సైకో జగన్‌. ఈ ఇద్దరు పిచ్చివాళ్లు కలిసి ఒక పిచ్చి కథను తయారు చేసి ప్రజల మీదకు వదులుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయాలనుకుంటే జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.43వేల కోట్లు అడ్డంగా ప్రజల నుంచి ఏవిధంగా దోచుకున్నాడనే అంశం మీద, కోడి కత్తి డ్రామా పైనా, బాబాయ్‌ని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన అంశంమీద, తాను చంపి అదే నేరాన్ని చంద్రబాబుపై నెట్టి ఊరూరా అబద్ధపు ప్రచారం చేసి ప్రజల సానుభూతి పొంది ఓట్లు సంపాదించిన విధానంపైనా వర్మ సినిమాలు తీయాల్సిందని ఆమె అన్నారు.

జగన్‌ ఎన్నికలలో తన తల్లిని, చెల్లిని వాడుకొని అవసరం తీరిన తరువాత పార్టీ నుంచి మెడపెట్టి బయటకు గెంటివేసిన విధానంపైన సినిమాలు తీస్తే రక్తికట్టి ఉండేది. ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో కుట్రలు, కుతంత్రాలలో ఆరితేరినవాడు, అత్యంత అవినీతిపరుడు, నేరస్తుడు జగన్‌. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరు జగన్‌ అయితే.. జగన్‌పైనే చంద్రబాబు, లోకేష్‌ కుట్రలు పన్నుతున్నట్లు సినిమాలు తీయటం విడ్డూరం. వర్మకు జగన్‌ క్రిమినల్‌ చర్యలపై సినిమాలు తీస్తే బాగుంటుంది. వర్మకు భారతీయ సాంప్రదాయాలపైన నమ్మకం లేదు. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రేమలపైన నమ్మకం లేదు. అతడొక మానసిక వ్యాధిగ్రస్తుడు. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే అతడి స్నేహితులు ఎటువంటివారో తెలుసుకోవాలంటారు.. ఇన్ని అవలక్షణాలున్న వర్మను జగన్‌ స్నేహితుడిగా ఎంచుకున్నాడంటే జగన్‌ మనస్తత్వం ఎటువంటిదో ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఆమె అన్నారు. వర్మపై పిచ్చివాడనే ముద్ర వేసి అతడితో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అటువంటి వ్యక్తిని పిలిపించుకొని తాను ఓ గొప్ప దేశభక్తుడినని చూపించుకుంటూ సినిమా తీయించుకున్నాడు జగన్‌. ఇద్దరి పిచ్చివాళ్ల కలయికతో రూపొందిన ఈ పిచ్చి సినిమాను ప్రజలెవరూ చూడరు. ప్రదర్శించిన థియేటర్లు నష్టాలు మూటగట్టుకోక తప్పదు. జగన్‌ దగ్గర కుప్పలుగా పడిఉన్న అవినీతి సొమ్ముతో ఇటువంటి పిచ్చి సినిమాలు తీసి ప్రజలపై వదులుతున్న జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు ప్రమీల, సూర్యదేవర ఝూన్సి, కృష్ణ వేణి, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, తాళికోట ఆశాబిందు,  కార్యాలయ కార్యదర్శి ఉప్పల శాంతి, కార్య నిర్వాహక కార్యదర్శి తగిరిశ లలిత, కార్యదర్శులు సురేఖ, సుధారాణి, మహిళా నాయకురాలు విజయలక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెంకన్న పేరు చెప్పి రుణాలు తీసుకుని పరారైతే…..?

Satyam NEWS

కుటుంబానికి అండగా ఉంటూ దోషులను కఠినంగా శిక్షిస్తాం

Satyam NEWS

నవ వసంతం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!