30.3 C
Hyderabad
March 15, 2025 10: 15 AM
Slider ప్రపంచం

కువైట్ లో తెలుగు వారి కన్నీటి కష్టాలు

#Kuwait Telugu people

కడప జిల్లా రాజంపేట నుంచి కువైట్ కు సంపాదన కోసం రాష్ట్రంలో నే అత్యధికంగా వేలాదిగా అక్కడికి వెళ్లి ఉన్నారు. వారు వేలు,లక్షలు అప్పులు చేసి కువైట్ కు ఇక్కడ కుటుంబాలను వదిలి వెళ్లారు. సంపాదించే వారు సంపాదిస్తుండగా కష్టాలు పడే వారు కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తోంది. దీనితో అక్కడ మన తెలుగు వారు అష్ట కష్టాలు పడుతున్నారు. అక్కడ కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు కర్ఫ్యూ కు మిన హాయింపు ఇస్తున్నారు.

రొట్టెలు కూడా దొరకని దుస్థితి

ఈ సమయంలో దుకాణాలల్లో వారికి కావలసినవి కొనుగోలు చేసుకోవడానికి మినహాయింపు ఇస్తున్నారు. అసలు సమస్య అక్కడే ఉంది. పనులు లేవు,ఆదాయం లేదు,ఆర్థిక ఆహార సమస్య వెంటాడుతోంది. అతి చవకగా లభించే కుబుష్ (రొట్టె)లు కూడా మరో వస్తువు కొంటెనే మనిషికి నాలుగు రొట్టెలు ఉన్న ఒక్క ప్యాకేట్ ఇస్తున్నారు. దీనితో బయట పనులు చేసుకొంటూ ఇంట్లో నే ఉన్న వారు ఆకలితో అలాంటిస్తున్నారు.

తమను ఆదుకోమంటూ వాట్సప్, యూట్యూబ్ లో వీడియోలు పెట్టి వేడుకొంటున్నారు. అప్పటికి అక్కడ మానవత్వం ఉన్న తెలుగు సంఘాల వారు తమకు తోచిన సహాయం చేస్తూ ఆదుకొంటున్నారు. అంతే కాకుండా బయట తిరగడానికి నిబంధనలు కూడా కఠినంగా ఉన్నాయి.

అబ్దులేలియా ప్రాంతంలో మగ్గుతున్న తెలుగు వారు

ఈ నేపధ్యంలో అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వారిని ఇక్కడికి రప్పించేందుకు భారత రాయభార కార్యాలయం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారం కావలసి ఉంది. ఇప్పటికే కువైట్ ప్రభుత్వం అక్రమంగా ఉన్న వారిని ఇండియాకి పంపేందుకు అబ్దులేలియా అనే ప్రాంతంలో దాదాపు 5 వేల మందిని గతనెల 18 నుంచి ఒక్క చోట చేర్చింది.

భారత ప్రభుత్వం అనుమతి రాక పోవడంతో వారు ఇంకా అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. సరిఅయిన ఆహారం లేదు. కేరళ వారికి భోజనాల సరఫరా చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారు. అయితే వారు నాణ్యత పాటించకుండా ప్లాస్టిక్ బియ్యం తో అన్నం వండి పెట్టడంతో ,బాధితులు అగ్రహించి తిరగబడడం తో వారు తప్పు సరిద్దుకున్నారు.

కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వదేశానికి రావడానికి త్వరితగతిన స్పందించాలని వారు కోరుతున్నారు.

Related posts

ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు

Satyam NEWS

నవంబర్ 26న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

మాపై వ‌చ్చిన ఆరోపణల్లో నిజం లేదు: జీవితా రాజశేఖర్‌

Satyam NEWS

Leave a Comment