26.7 C
Hyderabad
April 27, 2024 08: 35 AM
Slider నల్గొండ

బత్తాయి ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

#Nalgonda DCC

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ విమర్శించారు. టిపిసిసి పిలుపు మేరకు రైతు సమస్యలపై మంగళవారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో రైతు సంక్షేమ దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల సేకరణ ,వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగుల కొరత ఏర్పడడంతో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు.

దీంతో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనీ మద్దె సుమన్, వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేష్, ఎంపిటిసి చింత యాదగిరి, మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు బాబా, అల్లి సుభాష్ యాదవ్, విజయ్, పాశం నరేష్ రెడ్డి, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వివిధ జాతీయ నాయకుల వేషధారణలో కనువిందు చేసిన చిన్నారులు

Satyam NEWS

అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలి

Satyam NEWS

Как читать графики акций: Как читать графики криптовалют РУКОВОДСТВО 2021 ️ БЕСПЛАТНО Кофе с крипто

Bhavani

Leave a Comment