42.2 C
Hyderabad
April 30, 2024 15: 16 PM
Slider ముఖ్యంశాలు

జార్ఖండ్ కు కాలినడకన బయలు దేరిన వలస కార్మికులు

#DBL Company Labour

జాతీయ రహదారి పనులను చేపడుతున్న డి బి ఎల్ కంపనీలో పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులను పట్టించుకోకుండా వదిలివేయడంతో సోమవారం రాత్రి 50 మంది కార్మికులు కాలినడకన బిచ్కుంద నుండి జార్ఖండ్ కు బయలు దేరారు.

గమనించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు బిచ్కుంద గ్రామంలో కార్మికులను అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారని అధికారులు కార్మికులను ప్రశ్నించగా జార్ఖండ్ రాష్ట్రం నుంచి పనుల నిమిత్తం డి బి ఎల్ కంపెనీలో గత సంవత్సరం నుండి పనిచేస్తున్నామని తెలిపారు.

 ప్రభుత్వం లాక్ డౌన్ నియమించడంతో యాజమాన్యం పట్టించుకోకుండా వదిలేశారని గత్యంతరం లేక కాలినడకన జార్ఖండ్ రాష్ట్రంలోని  గద్ వాడ్ జిల్లాలోని తమ నివాస గ్రామానికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేక  కాలినడకనే బయలుదేరమని తెలిపారు.

వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది డి బి ఎల్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు కార్మికులను ఇలా వెళ్లిపొమ్మని వదిలి వేయడం సమంజసం కాదని కార్మికులను వెనుకకు రప్పించుకోక పోతే కేసు నమోదు చేస్తామని తెలపడంతో వెంటనే వాహనం పంపించి కార్మికులను డి బి ఎల్ కంపెనీ ప్రాంగణంలో కి తీసుకెళ్లారు. కార్మికులతో పనులు చేయించుకుని రోడ్డుపై వదిలివేయడం ఎంతవరకు సమంజసమని డి బి ఎల్ కంపెనీ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

ఢిల్లీ నుంచి మకాం మారుస్తున్న సోనియాగాంధీ

Satyam NEWS

సీనియర్ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున మృతి

Satyam NEWS

27న భారత్ బంద్ కు నవతరం పార్టీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment