40.2 C
Hyderabad
May 6, 2024 15: 07 PM
Slider ప్రత్యేకం

లోకేషా ఎంత పని చేశావు లోకేషా…..?

#naralokesh

ఏపిలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం డిమాండ్ చేయడం, ప్రభుత్వం అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

అయితే ఏపిలో మాత్రం అలా కాదు….. ప్రతిపక్షం డిమాండ్ చేసింది కాబట్టి చేయాల్సిన పని అయినా వాయిదా వేస్తుంది ప్రభుత్వం.

ఇదేదో సాధారణ పరిస్థితుల్లో అయితే ఏపిలో ఈ ‘‘కుల’’ రాజకీయం ఇంతేలే అని సరిపెట్టుకోవచ్చు…. అయితే కరోనా పాండమిక్ లో కూడా ఇలానే జరుగుతున్నది.

అంతే కాదు విద్యార్ధుల జీవితాలకు సంబంధించిన విషయంలోనూ రాజకీయాలు తప్పడం లేదు. విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు.

ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు జనరల్ ప్రొమోషన్ ఇచ్చేశారు. అదే విధంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సీబీఎస్ఈ కూడా నిర్ణయం తీసుకున్నది.

ఒడిస్సా, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేశాయి.

ఈ విషయంపై నేడు హైలెవెల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్వహిస్తున్నారని నిన్ననే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది.

హైలెవెల్ సమావేశం జరుగుతున్నది కదా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఒక కోరిక కోరారు.

అదేమిటంటే కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు రద్దు చేయాలి అని. ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

ఏపి ప్రభుత్వం నిర్ణయం కోసం లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కూడా నేటి ఉదయం నుంచే వేచి చూస్తున్నారు.

అన్ని రాష్ట్రాలలో టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నందున ఏపిలో కూడా అలానే జరుగుతుందని ఆశించారు. అయితే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

అయితే ఇంటర్, పదో తరగతి పరీక్షలు యధాతథంగానే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క సారిగా విద్యార్ధులు ఆశ్చర్య పోగా, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

తెలుగుదేశం నాయకుడు, అదీ కూడా నారా లోకేష్ డిమాండ్ చేస్తే మనం నిర్ణయం తీసుకోవడమేమిటి అనుకున్నారో ఏమో కానీ ఏపి ప్రభుత్వం మాత్రం చాలా రాష్ట్రాలకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నది.

రాబోయే రెండు మూడు రోజుల్లో వైసీపీ నాయకులు ఎవరైనా టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని ప్రాధేయపడితే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంటుందేమో చూడాలి.

Related posts

ముగిసిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష

Satyam NEWS

కాంట్రవర్సీ: సింహాచలంలో రాజకీయ నిర్ణయాలు

Satyam NEWS

ఆ మూడుగంట‌లు ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ట్రాపిక్ క్లియ‌ర్…..!

Satyam NEWS

Leave a Comment