దీపావళి పర్వదినం తర్వాత కార్తీక మాసంలో జరిగే తెల్లరాళ్లపల్లి తండా తుల్జాభవానీ పండుగ నేడు ఘనంగా ప్రారంభమైంది. ముత్యాలమ్మగా పిలుచుకునే తెల్లరాళ్లపల్లి తుల్జాభవానీ పండుగను కొల్లాపూర్ పులిబిడ్డ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తుల్జాభవాని ఈ ప్రాంతంలోని వారందరిని చల్లగా చూడాలని ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు కోరారు. యువతీయువకులు మరింత అభివృద్ధి చెంది సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ముత్యాలమ్మ తల్లిని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ పండుగలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావుతో బాటు పానగల్ మండల్ TRS ప్రసిడెంట్ కేతేపల్లి రవి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, గోవర్ధన్ సాగర్ భాస్కర్ యాదవ్, శ్రీను, లక్ష్మణ్, గ్రామ పెద్దలు రాజునాయక్, SI లింగ నాయక్, గోపాల్ కృష్ణ సీతమ్మ ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
previous post