33.7 C
Hyderabad
April 29, 2024 23: 09 PM
Slider ఆంధ్రప్రదేశ్

టెన్త్ క్లాస్: తెలంగాణ బాటలో నడిచిన ఆంధ్రప్రదేశ్

#Aadimulapu Suresh

ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. పదో తరగతి చదివిన విద్యార్థులంతా పాస్ అయినట్టు ఏపి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామని ఆయన అన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.

Related posts

యూత్ కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం

Bhavani

మంత్రుల పర్యటన కు విస్తృత ఏర్పాట్లు

Bhavani

రక్తదానంతో మరొకరికి ప్రాణం పోద్దాం

Bhavani

Leave a Comment