39.2 C
Hyderabad
April 28, 2024 12: 47 PM
Slider విజయనగరం

ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగించాలంటూ బీజేపీ ధర్నా

#bjpvijayanagaram

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో పేదలకు ప్రవేశ పెట్టి కొనసాగిస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేయడం అన్యాయమని బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) పేరుతో 2020 కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఈ ఉచిత బియ్యాన్ని ఈ 2022 దీపావళి వరకూ పొడిగించింది. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ పధకాన్ని గత ఏప్రిల్ నెల నుండి రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా ఆపిందని భారతీయ జనతాపార్టీ నార్త్ జోన్ మండల అధ్యక్షులు ఇమంది సుధీర్ అన్నారు.

ఈస్ట్ జోన్ మండల అధ్యక్షులు కొండల శ్రీనివాస్, వెస్ట్ జోన్ మండల అధ్యక్షులు గిరిబాబు, రూరల్ మండల అధ్యక్షులు కంది సీతారాం ఆధ్వర్యంలో  నేడు విజయనగరంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద  తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తూన్న  ఉచిత బియ్యాన్ని పేద ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత ఏప్రిల్ నుండి ఇవ్వకుండా దాచిన పేద ప్రజల బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలంటూ నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బగ్గాం రాజేష్ , ఈస్ట్ జోన్ మండల అధ్యక్షులు కొండల శ్రీనివాస్, వెస్ట్ జోన్ మండల అధ్యక్షులు గిరిబాబు, రూరల్ మండల అధ్యక్షులు కంది సీతారాం, సోము మహేష్, కట్టా బాబు, మజ్జి రమేష్, గొలగాన రమేష్, అబ్దుల్ ఆధిల్, గ్రంధి కృష్ణమూర్తి, అప్పారావు దొరా, యుగంధర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

11 మంది సజీవదహనం

Sub Editor 2

శ్రీ మాత చారిటబుల్ ట్రస్ట్ త్రిశత్యాత్మక చండీపీఠం గణపతి హోమం

Satyam NEWS

ఢిల్లీ వెళ్లొచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా బయటకు రావాలి

Satyam NEWS

Leave a Comment