31.2 C
Hyderabad
May 3, 2024 02: 13 AM
Slider ఆదిలాబాద్

కంటైన్మెంట్ జోన్ లో ప్రతిరోజు థర్మల్ స్క్రీనింగ్ చేయండి

Nirmal Collector

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన వారి బంధువుల, చుట్టుపక్కల, పరిచయాలు ఉన్న వారి ధర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ లు ప్రతి రోజు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్యులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆర్ బి ఎస్ కే వైద్యుల నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి ఏ బి సి కేటగిరీలుగా విభజించి ప్రతి రోజు థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. పదిహేను రోజులపాటు దేనిని తేలికగా తీసుకోవద్దని జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని గుర్తించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావ్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ దేవేందర్ రెడ్డి, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆశిష్, ఆర్ బి ఎస్ కే వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొవ్వాడ అణుపార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

BJP ప్రభుత్వం తన మొండి విధానాలను విడనాడాలి

Satyam NEWS

పోలీస్ విజిల్: ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్ర భగ్నం

Satyam NEWS

Leave a Comment