28.7 C
Hyderabad
April 26, 2024 10: 11 AM
Slider అనంతపురం

స్త్రీ హింస వ్యతిరేక పక్షోక్షవాలు ఆరంభం

ప్రపంచ స్త్రీ హింస వ్యతిరేక పక్షోత్సవాల కార్యక్రమాన్ని నేడు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 15 రోజులు జరిగి డిసెంబర్ 10న ముగుస్తుంది. జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీలపై జరుగు హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, స్త్రీలపై హింసకు పాల్పడుతున్న వారి పట్ల నమోదుతున్న సెక్షన్లు, వారికి విధిస్తున్న శిక్షలు గురించి తెలియజేశారు. నేటికీ కూడా దేశంలో చాలామంది స్త్రీలకు గృహింస చట్టంపై సరైన అవగాహన లేదని అందువలన ప్రతి స్త్రీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వబడిన హక్కులు చట్టాల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తద్వారా ఈ చట్టాల ద్వారా భౌతిక హింసలు, భౌతిక దాడుల నుంచి రక్షణ పొందగలరని తెలియజేశారు. దేశంలో 29 శాతం స్త్రీలు నేటికీ కూడా గృహాహింస గురవుతున్నట్టు ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలియజేస్తుందని, వారిలో కూడా 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలే ఎక్కువ శాతం గృహా హింస కు, భౌతిక దాడులకు గురవుతున్నారని అన్నారు.

కావున ప్రతి స్త్రీ కూడా ప్రభుత్వం ద్వారా వారి రక్షణ కోసం చేసిన చట్టాల గురించి తెలుసుకున్న రోజే వారు ఈ హింస నుండి విముక్తి పొందగలరని అన్నారు. హింస నుండి విముక్తి పొందడానికి ఏ స్థాయిలోనైనా పోలీసులు వారి సహాయ సహకార ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఎవరైనా సరే ఇలాంటి హింసకు బాధితులుగా ఉన్నట్లయితే నిర్భయంగా పోలీసులు ఆశ్రయించవచ్చని తద్వారా వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి , సహాయ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణయ్య, మరియు ఎంపీడీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

గోదావరిలో మునిగిపోయిన ఏపి పర్యాటక రంగం

Satyam NEWS

పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలి

Satyam NEWS

10 నుండి 18 వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment