29.7 C
Hyderabad
April 29, 2024 08: 14 AM
Slider ముఖ్యంశాలు

లిక్కర్ కేసు దారి మళ్లించేందుకే కవిత దొంగ దీక్ష

#liquor case

లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే చట్ట సభల్లో 33 శాతం మహిళ రిజర్వేషన్ పేరుతో కవిత ఢిల్లీలో దీక్ష తలపెట్టారని బీజేపీ జాతీయ కార్యదర్శి డీ.కే.అరుణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. “తెలంగాణలో 33% సీట్లు మహిళలకు ఇవ్వలేదని మీ నాన్న ను ఎందుకు అడగట్లేదు కవిత’’ అని ఆమె ప్రశ్నించారు. మహిళ బిల్లును చించేసిన పార్టీలతో కలిసి వెళ్లిన కవిత ఢిల్లీ దీక్ష ద్వారా ఏం సాధిస్తారని అరుణ ప్రశ్నించారు. కేసిఆర్ కు బిడ్డ తప్ప ఇంకే మహిళ కనిపించదు..

రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖను మహిళలకు ఇచ్చిన ఘనత మోడీ ది.. కీలకమైన ఆర్థిక శాఖ మహిళ కు కేటాయించింది. ఆదివాసీ మహిళ ను రాష్ట్రపతి గా పెడితే బీ అర్ ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటింగ్ కు పాల్పడింది. మహిళల మీద నగరం నడబొడ్డున అనేక అకృత్యాలు జరిగిన సీఎం క్యాంప్ ఆఫీస్ లో పని ఏ అధికారి మాట్లాడలేదు.

కేసిఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుంది. సీఎం కళ్ళు మొక్కి ఐఏఎస్ ల గౌరవం తీస్తున్న ఆఫీసర్స్ రాజకీయాలపై ఇంటరెస్ట్ ఉన్న అధికారులు ఎవరైనా రాజీనామా చేసి రాజకీయాల్లో రావాలి. ఏ పథకం ఇచ్చిన బీ అర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకే ఇవ్వాలని అదేశాలు ఇస్తున్న అధికారులు ప్రజ సేవ కంటే డబ్బు

సంపాదన ముఖ్యమనే భావన ఎమ్మెల్యే లో తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ ది ఎకరం 100 కోట్లు పలికింది అంటున్నారు.. సామాన్యుడు దాన్ని కొనగలడా? కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై భూములు వారికే కట్టబెట్టి దోచుకుంటున్నారు. ఖరీదైన భూములను పార్టీ ఆఫీసుల పేరు మీద తక్కువా కు కొట్టేశారని డీ.కే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Related posts

వరుస పెట్టి పోలీసు స్టేషన్లను తనిఖీ చేస్తున్న విజయనగరం ఎస్ పి

Satyam NEWS

సేవారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన రత్నకుమారి

Bhavani

తిరుపతిలో అక్రమ మద్యం గుట్కా స్వాధీనం

Satyam NEWS

Leave a Comment