27.7 C
Hyderabad
April 30, 2024 10: 11 AM
Slider ఖమ్మం

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

#sfi

పేదవర్గాల విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్రే నూతన జాతీయ విద్యా విధానం అని  రిటైర్డ్ హెచ్.ఎం వై శ్రీనివాసరావు అన్నారు.  సుందరయ్య భవన్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానం-ఓ పరిశీలన అనే అంశం పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ లో  శ్రీనివాసరావు మాట్లాడుతూ  నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు.. ఉన్నత విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ప్రైవేటీకరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో విద్యారంగానికి కనీస నిధులు కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ,ప్రైవేటు గ్లోబల్ యూనివర్సిటీలను ఆహ్వానించడం హేయమైన చర్య అన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ సంపన్న వర్గాలకే చదువులు అన్న మాదిరిగా పాలకుల తీరు ఉందన్నారు. ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్సిటీలు భారతదేశానికి రావాలని ఈ విధానం స్వాగతం పలుకుతోందనీ, తద్వారా ప్రపంచ స్థాయి ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు విదేశాలకు పోవాల్సిన అవసరం ఉండదనీ, చాలా ఖర్చు తగ్గుతుందనీ, స్వదేశంలోనే విదేశీ విద్యను నేర్చుకోవచ్చని చెబుతోందన్నారం.. కానీ ఉన్నత విద్యాభివృద్ధి పేరుతో ఏర్పాటుచేసే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు, అటానమస్‌ డిగ్రీ కాలేజీలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉండవు. అలాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతుల్లోని పేదలకు చదువుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మధు, ఖమ్మం టౌన్ కార్యదర్శి తరుణ్, బీవీకే గ్రంథాలయ నిర్వహకులు సుబ్బారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కలకలంతో అమరావతి సచివాలయం ఖాళీ

Satyam NEWS

కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

బిసిల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన ఆచారికి ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment