28.7 C
Hyderabad
April 27, 2024 05: 55 AM
Slider అనంతపురం

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులు అటాచ్‌

బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయినందున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దివాకర్‌ రోడ్‌లైన్స్‌, ఝటధార ఇండస్ట్రీస్‌ ఆస్తులు, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్‌ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను కూడా ఈడీ అటాచ్‌ చేసింది. సుమారు రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయనేది ఆరోపణ. ఝటధార ఇండస్ట్రీస్‌, గోపాల్‌ రెడ్డి అండ్‌ కో కంపెనీలు అశోక్‌లేలాండ్‌ నుంచి తక్కువ ధరకే బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేశాయి. నాగాలాండ్‌, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించాయి. రూ.38.36 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించినందున ఈడీ ఈ చర్య తీసుకున్నది.

Related posts

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటే ఎలా ప్రసన్నా?

Satyam NEWS

సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల బ్రేకప్?

Bhavani

బ్లాక్ లిస్ట్:వెస్ట్‌ బ్యాంక్‌లో 112 కంపెనీలపై నిషేధం

Satyam NEWS

Leave a Comment