38.2 C
Hyderabad
April 29, 2024 20: 15 PM
Slider జాతీయం

పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం

#Parliament

ఈ వర్షాకాల సమావేశంలో మణిపుర్‌ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. తాజాగా ఇదే విషయమై విపక్ష ఎంపీల నుంచి నిరసన వ్యక్తం కావడంతో రెండు నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది. దీనికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుపట్టారు.

‘వారు పార్లమెంట్‌లో శాంతియుత చర్చకు ముందుకురావడం లేదు. అలాగే బిల్లుల్ని ఆమోదించడానికి సహకరించడం లేదు. వారి నుంచి సూచనలు స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ వారు మాత్రం ఉన్నట్టుండి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు.

వారు మణిపుర్‌కు సంబంధించిన వాస్తవాలు బయటకురావాలని కోరుకుంటే.. దానిపై చర్చించడానికి పార్లమెంట్‌కు మించి మంచి వేదిక లేదు’ అని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.

Related posts

బీఆర్ఎస్ బీజేపీలు ఎప్పటికి ఒక్కటి కాలేవు

Satyam NEWS

ఆక్సిజన్ కోసం విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ

Satyam NEWS

బీహార్ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రద్దుకు సీబీఐ యత్నం

Satyam NEWS

Leave a Comment