26.7 C
Hyderabad
April 27, 2024 09: 39 AM
Slider నెల్లూరు

వైసీపీ నేతపై మహిళా వాలంటీర్ ఫిర్యాదు

పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాజీ కౌన్సిలర్‌ ఒకరు ఫోన్‌చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ అక్కడి రాజీవ్‌నగర్‌ వాలంటీరు కొమ్మల మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళా వాలంటీరుకు ఆ వైసీపీ చోటా నేత వరసకు పినతండ్రి అవుతాడు అయితే కామాతురాణాం నభయం నలజ్జ… అన్నట్లు అతడు కూతురు వరసైన ఆమెపైనే కన్నేశాడు.

ఫోన్‌చేసి వేధిస్తున్నాడని, ఫోన్‌ తీసి బాబాయ్‌ అని సంబోధిస్తే అలా పిలవమాకు.. నువ్వంటే నాకిష్టం అని చెప్పేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 3మాసాలుగా ఆయన తన వెంటపడుతున్నాడని ఆమె వాపోయింది. పథకాలు అమలు విషయంలో తనకు చెప్పిచేయాలంటూ ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొంది. అదే ప్రాంతానికే చెందిన మరో వాలంటీరు కూడా అతనిపై ఇదే ఫిర్యాదు చేశారు. ఇలా తమను ఇబ్బంది పెడుతుంటే తాము ఎలా పనిచేయాలంటూ ఆ వాలంటీర్లు విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Related posts

గట్టు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో  చేరికలు

Satyam NEWS

కరోనా రోగులకు సేవలు అందించిన సాజిద్ ఖాన్

Satyam NEWS

మసీద్ పాత కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ 9 ఎలాట్మెంట్ రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment