28.7 C
Hyderabad
April 28, 2024 06: 17 AM
Slider విజయనగరం

ఎస్పీ ఆదేశాలిచ్చారు… సిబ్బంది పాటించారు…!

#SP M. Deepik

విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వారి వారి స్టేషను పరిధిలోని ముఖ్య కూడళ్లు, విద్యా సంస్థలు, బస్టాండులు, రైల్వే స్టేషనుకు సందర్శించారు.

ప్రజలు, మహిళలు, విద్యార్థులకు దిశా ఎస్ ఓఎస్ యాప్ ప్రాధాన్యతను వివరించి, ఆపద సమయంలో దిశా ఎస్ఓఎస్ వినియోగించి ఏవిధంగా రక్షణ పొందవచ్చో వివరించి, వారి మొబైల్ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ మేరకు జిల్లా లో ని రాజాం లో కేర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద స్టేషన్ ఎస్ఐ లీలావతి… కాలేజీ విద్యార్ధిని లతో వారి వారి స్మార్ట్, ఏండ్రాయిడ్ ఫోన్ లలో దిశ మొబైల్ యాప్ ను దగ్గరుండి డౌన్లోడ్ చేయించారు. ఈ సందర్భంగా రాజాం స్టేషన్ ఎస్ఐ లీలావతి…”సత్యం న్యూస్.

నెట్ ” ప్రతినిధి తో మాట్లాడుతూ…. కాలేజీ లకు..ట్యూషన్ లకు స్కూళ్లకు వెళుతున్న అమ్మాయి లు ,బాలికలు…ఇలా ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోందని… తప్పకుండా వాళ్లందరూ “దిశ” యాప్ ను డౌన్లోడ్ చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్పీ మేడం ఆదేశాలతో…అలాగే సీఐ సూచనలతో… ప్రతీ రోజూ “దిశ” మొబైల్ యాప్ పట్ల..విద్యార్ధినుల్లో అవగాహన కల్పిస్తున్నామని ఎస్ఐ లీలావతి చెప్పారు.

Related posts

స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో చంద్రబాబు అరెస్టు సమంజసమేనా?

Satyam NEWS

కౌంటర్: జగన్ కు మినహాయింపు ఇవ్వద్దని కోరిన సీబీఐ

Satyam NEWS

సీఎం జగన్ అజ్ఞానంతో విద్యా వ్యవస్థ అధ్వాన్నం

Satyam NEWS

Leave a Comment