39.2 C
Hyderabad
April 28, 2024 11: 06 AM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుంది.

#governor

తెలంగాణ సాధిస్తున్న సమగ్ర అభివృద్ధి దేశానికి ఆదర్శం అని గవర్నర్ తమిలి సై  పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రగతిని తెలంగాణ సాధిస్తుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు  జాతీయ గీతం ఆలపించి ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ప్రసంగం పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది. అనే కాళోజి సూక్తితో గవర్నర్ తమిళ సై ప్రసంగాన్ని ప్రారంభించారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యంశాలు

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఫ్లోరైడ్ పీడ సంపూర్ణంగా అంతమైంది. దళిత బంధు దేశానికి దిక్సూచిగా ఉంది. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గ ధామంగా మారింది.విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించింది. రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ తో ప్రగతి సాధించాము. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా , విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, మన ఊరు – మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటుతో  అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది అని గవర్నర్ ప్రసంగలో పేర్కొన్నారు.

Related posts

ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ టీకా తీసుకోవాలి

Satyam NEWS

దివాలాతీసిన ఏపి విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

వ్యవసాయ మార్కెట్ లో దళారులు లేకుండా చేస్తా

Satyam NEWS

Leave a Comment