40.2 C
Hyderabad
April 29, 2024 16: 58 PM
Slider మహబూబ్ నగర్

చోరీ చేసిన బంగారం ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు

#Kalwakurthy Police

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కళ్యాణ్ నగర్ వీధిలో ఈనెల 16వ తేదీన పట్టపగలు దొంగతనం చేసిన నిందితులు పట్టుబడ్డారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు ఆ వివరాలు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల కు చెందిన బొంతల మూర్తి (26) మొండి కృష్ణ (35) హన్వాడకు చెందిన అక్క పల్లి చంద్రశేఖర్ (30) లను అనుమానంతో శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టణ పాలమూరు నాలుగు కూడలిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు కల్వకుర్తి బస్ స్టాండ్ నుండి మహబూబ్ నగర్ చౌరస్తా కు వస్తూ పోలీసుల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.

విచారణలో భాగంగా వారంతట వారే కల్వకుర్తి పట్టణంలో ఈనెల 16న చేసిన దొంగతనం ఒప్పుకున్నారని, వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కు తీసుకు వచ్చి ఇరువురి పంచుల సమక్షంలో పంచనామా చేసినట్లు ఆయన తెలిపారు.

పంచనామా చేసే సమయంలో గతంలో జడ్చర్ల, షాద్ నగర్, కేశంపేట్ మండలాలలో చేసిన దొంగతనాలు గాను జైలుకు వెళ్లి వచ్చినట్లు, అదే విధంగా ఈ నెల 13వ తారీఖున దేవరకద్ర లో చేసిన చోరీ తో పాటు 16న వెల్దండ, కల్వకుర్తి లో చోరీలకు పాల్పడినట్లు వారంతట వారే ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు.

చోరీ చేసిన నగదును ఖర్చు చేసినట్లు, బంగారాన్ని జడ్చర్ల ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టినట్లు వారు తెలిపారు. మిగిలిన వెండి నగదును జడ్చర్ల లో దాచి పెట్టినట్టు తెలిపారని ఆయన పేర్కొన్నారు. నేరస్తుల నుండి 8.7 తులాల బంగారు,23 తులాల వెండి ఆభరణాలు తో పాటు 30 వేల రూపాయల నగదు, స్క్రూ డ్రైవర్, పైపు రేంజ్ పాన, ఇనుపరాడ్ ఒక బ్యాగును స్వాధీనపరచు కొన్నట్లు సీఐ సైదులు పేర్కొన్నారు.

తనతో పాటు పట్టణ ఎస్సై మహేందర్ ,క్రైమ్ పార్టీకి చెందిన  పి.సి 1912,పి.సి 3142 చాకచక్యం వల్ల కేసును త్వరగ తిన చేధించినట్లు ఆయన పేర్కొన్నారు.

Related posts

హైదరాబాద్‌లో రూ. 80 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Satyam NEWS

మూడు రోజుల్నించి అడుగుతున్నా సీఎం కలవడం లేదు

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఓ వరం

Satyam NEWS

Leave a Comment