26.7 C
Hyderabad
May 3, 2024 08: 16 AM
Slider జాతీయం

రెడ్ ఎలర్ట్: కరోనా వైరస్ తో దేశంలో మూడో మరణం

corona 18

కరోనా వైరస్ సోకిన మూడో వ్యక్తి కూడా మరణించాడు. దేశంలో కరోనా వైరస్ తో మరణించిన మూడో వ్యక్తి ఇతడు. 63 సంవత్సరాల ఇతను ముంబయిలో మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 137 మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు.

అందులో అతి ఎక్కువగా మహారాష్ట్ర నుంచి 39 కేసులు ఉన్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి సుమారుగా ఐదు రోజుల పాటు ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కస్తూరిబా ఆసుపత్రికి అతడిని తరలించారు. దుబాయ్ నుంచి తాను వచ్చినట్లు ఇతను అధికారులకు చెప్పలేదు.

దాంతో అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేకపోయారు. ఇతడి భార్య కు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నది. ఈ నెల5 న దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్న రోగి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత ఊపిరితిత్తులు, ఛాతీ నొప్పితో ఆయన ఫిర్యాదు చేయగా, ఆ తర్వాత ఆయనను హిందూజా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. తరువాత వైద్యులు అతని మీద కరోనరీ ప్రొసీజర్ అమలు చేయడానికి ముందుకు వచ్చిన కస్తూర్బా ఆసుపత్రిలో పరీక్షల కొరకు పంపారు. మార్చి 12 న కస్తూర్బా ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి అప్పటికే ఉన్న వ్యాధుల కారణంగా మరణించాడా లేక కరోనా వల్ల మరణించాడా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే ఇక్కడ విలేకరులకు తెలిపారు.

తీవ్ర స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చిన రోగి చికిత్సకు బాగా స్పందించారని మంత్రి తెలిపారు. అయితే అతని హృదయ స్పందన ఈ ఉదయం అకస్మాత్తుగా పడిపోవడంతో చనిపోయాడు అని మంత్రి తెలిపారు. హిందూజా ఆసుపత్రిలో నర్సులు, ఇతర సిబ్బందిని కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు.

అదే విధంగా కస్తూర్బా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉండగా అతనికి చికిత్స అందించిన లేదా కలిసిన 85 మందికి పైగా వ్యక్తులను కూడా గుర్తించి పరీక్షలు చేస్తున్నారు.

Related posts

విజయనగరం రూరల్ పీఎస్ కు ఎస్పీ సర్ప్రైజ్ విజిట్…!

Satyam NEWS

జగన్ పార్టీకి ఆయన తల్లి వై ఎస్ విజయలక్ష్మి గుడ్ బై

Satyam NEWS

నిజాం తరహా కేసీఆర్ పాలనను తరిమి కొట్టాలి

Satyam NEWS

Leave a Comment