37.2 C
Hyderabad
May 2, 2024 14: 07 PM
Slider ముఖ్యంశాలు

ఒక పోలీసు చెప్పిన కథ: ఇది కల కాదు…కథ అంతకన్నా కాదు

Rajasekhar

ఉదయం 6:00 గంటలు. తెల తెల వారుతున్నది. సూర్యుడు క్రమంగా నిద్ర లేస్తూనే, సమాజాన్ని నిద్ర లేపుతున్నాడు. పక్షులు, జంతువులు తమ నివాసాల నుండి బయటకు వెళుతున్నాయి. ఒక ఊరి చివర నివాసం ఉంటున్న మల్లమ్మ తన చేతిలో చీపురుతో ఆ ఊరి లోకి వెళుతోంది.  

ఆ ఊరిలోనే నివాసం ఉంటున్న ఎల్లయ్య తన భుజం పై బిందె నిండుగా మంచి నీరు మోస్తూ ఉరిలోనికి వెళుతూ ఉన్నాడు. వికసించిన పూలతో చేసిన పూలమాలతో నారాయణ,  ఉరి మధ్యకు వెళుతున్నాడు. వ్యవసాయ రైతు శీనయ్య తన చేతిలో నూనె దీపం తో  వడి వడిగా ఉరి మధ్యకు వస్తున్నాడు.

కంపెనీలో పనికి వెళ్లే కార్మికులు వేగంగా ఉరి మధ్య భాగం వైపు వెళ్తున్నారు. ఆ ఊరిలో నివాసం ఉంటున్న పంతులు శేఖరయ్య తనతో మిఠాయిలు తీసుకొని ఉరి మధ్య భాగం వైపుగా వెళుతున్నాడు. అదే ఊరిలో నివాసం ఉంటున్న మల్లిక తన ఒక చేతిలో 10 నెలల చంటి బిడ్డతో  మరో చేతిలో మంచి కవితలు, పాటలు రాసి పెట్టుకున్న కాగితాలతో ఉరి మధ్య భాగం వైపు వెళుతుంది.  

అలా వాళ్లంతా, చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని, తన  చూపుడు వేలితో సమాజానికి దిశ నిర్దేశం చేస్తున్న, ఆ ఊరి మద్య నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టి ఉన్న డాక్టర్ బి ఆర్  అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం దగ్గరకు  చేరుకున్నారు. సామాజిక అసమానతలు, అవిద్య, అజ్ఞానాన్ని, స్త్రీ ల అణచి వేతలను, దేవుని పేరుతో, కులం పేరుతో జరిగే దోపిడీని అంత మొందించడానికి ఉద్భవించిన మహానుభావుడి జయంతి జరుపుకోవడం కోసం అందరూ అక్కడికి వచ్చారు.

 మల్లమ్మ తన  చీపురు తో విగ్రహ ప్రాంగణాన్ని శుభ్రం చేసింది.  ఎల్లయ్య తను తెచ్చిన మంచి నీటిని అంబేడ్కర్ విగ్రహం పై  పోసి శుభ్రం చేశాడు.  నారాయణ తన వెంట తెచ్చిన పూల దండను అంబేడ్కర్ మెడలో వేసి, మిగిలిన పూలను విగ్రహం పై చల్లాడు.

శీనయ్య తన చేతిలో ఉన్న నూనె దీపాన్ని అంబేడ్కర్ పాదాల దగ్గర పెట్టాడు. క్రమ క్రమంగా ఆ ఊరి జనం విగ్రహం దగ్గరకు చేరుకుంటున్నారు.  కొంత సేపటి తరువాత  ఆ విగ్రహం చుట్టూ  పరిసర ప్రాంతాలలో  పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళతో కోలాహలంగా మారింది.

పంతులు తన తో తెచ్చిన మిఠాయిలు ప్రజలకు పంచి పెట్టాడు. అంబేడ్కర్ గురించి వివరించి చెప్పాడు. మల్లిక తనతో తెచ్చుకున్న కాగితాలను చూసి అంబేడ్కర్ గొప్పతనంపై కవితలు చదివింది. మార్పును అంగీకరిస్తూ, సమానత్వాన్ని ఆమోదిస్తూ అంబేద్కర్ చేసిన పనులు వివరించుకుంటున్నారు.

సమానత్వం, సమాన అవకాశాలు, నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్,  కార్మికులకు పని గంటలు నిర్దేశించడం, ట్రేడ్ యూనియన్లకు ఖచ్చితమైన గుర్తింపు, ఉద్యోగస్తులకు కరువు భత్యం, ఉద్యోగస్తులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం,

లీగల్ స్ట్రైక్ యాక్ట్, ప్రావిడెంట్ ఫండ్, కార్మిక సంక్షేమ నిధులు, సాంకేతిక శిక్షణ, కేంద్ర వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, భారత గణాంక చట్టం, కేంద్ర సాంకేతిక విద్యుత్ సంస్థ, హిరాకుడ్ డ్యాం ఏర్పాటు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, భాక్రా నంగల్ డ్యాం,

సోనీ రివర్ వాలీ ప్రాజెక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు, స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు, పవర్ గ్రిడ్ సిస్టం, రివర్ గ్రేడ్ సిస్టం, ప్రతి స్త్రీ సం రక్షణ పొందే హక్కు, ప్రతి స్త్రీ తనకు ఆస్తి కలిగి ఉండే హక్కు, ఇష్టం లేని భర్తతో ఒక వివాహిత విడాకులు పొందే హక్కు,

గర్భిణీ స్త్రీల సెలవులు, ప్రసూతి సౌకర్యాల చట్టం, స్త్రీ పురుష అనే తేడా లేకుండా సమాన పనికి, సమాన వేతనం, మహిళా కార్మికుల రక్షణ చట్టం, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) లెక్కలేనన్ని గొప్ప పనుల గురించి, అంబేద్కర్ కల్పించిన సౌకర్యాల గురించి చర్చించుకుంటున్నారు.

గొప్ప భారతీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి కాకపోతే ఇంత ముందు చూపు ఉంటుందా? కొందరు స్వార్ధ పరులు కల్పించిన దురభిప్రాయాలు దూరం కావాలి. తప్పుడు కథనాలు మట్టిలో కలిసిపోవాలి.

మనిషి ప్రవర్తన అతని కులాన్ని బట్టి ఉండదని, అతని చదువు, సంస్కారం, మర్యాద, మంచి మనస్సు, సాటి మనుషుల పై ఉండే ప్రేమ అభిమానాలు, చూపే జాలి దయల పై ఆధారపడి ఉంటుంది అని అందరికి తెలియాలి.

కులానికి జ్ఞానానికి సంబంధం లేదు. కులం ఒక మానసిక రోగం, ఒక మోసకారి పదం. కులమే మనిషి మనుగడకు అడ్డంకి. ఈ చైతన్యం వెల్లివిరిస్తే కాదా మన ప్రతి పల్లె ఒక స్వర్గం?

కేశవ్, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామాటిపురా పోలీస్ స్టేషన్, హైదరాబాద్ సిటీ

Related posts

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

Bhavani

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం…!

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment