37.2 C
Hyderabad
May 2, 2024 11: 09 AM
Slider ముఖ్యంశాలు

భార్య భర్తలతో సహా కుమార్తె ఆత్మహత్య

#suicide

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కొత్తకారాయిగూడెం గ్రమంలో భార్య భర్త లతో పాటు కుమార్తె మామిడి తోట లో చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.ఇందుకు సంబందించిన వివరాల ప్రకారం… కొత్తకారాయిగూడెం గ్రామంకు చెందిన పొట్రు కృష్ణయ్య( 40), సుహాసిని (35) దంపతులకు కార్తీక్, అమృత పిల్లలు. ఈ కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. కృష్ణ, సుహాసినిలు వ్యవసాయం చేసుకుంటూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు.

కార్తీక్ బి టేక్ చుదువుతుండగా అమృత ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ లో జాయిన్ కావాల్సి వుంది. ఇప్పటి వరకు వీరు ఒకర్ని వీడి ఒకరు ఉండేవారు కాదు. ఈ సమయంలోనే క్యాన్సర్ వ్యాధి వీరిలో ముగ్గురు ప్రాణాలు తీసుకునేందుకు కారణం అయ్యింది. గత రెండు నెలల క్రితం సుహాసినికి కడుపులో నొప్పి రావడం తో కృష్ణా జిల్లా తిరువూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చూపించుకున్నారు.

సుహాసినికి పరీక్షలు చేసి కడుపులో కణితి ఉందని చెప్పడంతో ఆపరేషన్ చేపించుకుని కణితిని తొలగించారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చి నెల రోజులు తరువాత గురువారం కార్తీక్ ను ఇంటి వద్దే ఉండమని చెప్పి కృష్ణ, సుహాసిని, అమృత ముగ్గురు కలిసి తిరువూరు వెళ్లి డాక్టర్ ను కలిశారు. సుహాసిని కడుపులో నుండి తీసిన గడ్డను పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపడంతో క్యాన్సర్ అని తెలింది. ఇదే విషయాన్ని డాక్టర్ వీరికి చెప్పి హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లి చూపించుకోవాలి అంటూ చెప్పారు.

సరేనంటూ అక్కడ నుండి బయటకు వచ్చారు. కాన్సర్ తో తన భార్య చనిపోతుందని, భార్య చనిపోతే తాను భతకలేననుకున్నాడు. ఇద్దరం చనిపోతే కూతురు ఏమైపోతుందోనన్నుకున్నారు. ముగ్గురు కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. తిరువూరు లోనే మూడు స్టూల్లు, మూడునైలాన్ తాడులు కొనుక్కొని ద్విచక్ర వాహనం పై కారాయిగూడెం వచ్చారు. ఇంటికి కూడా వెళ్లకుండా మామిడి తోట సమీపంలో రోడ్ పై ద్విచక్రవాహనం పెట్టి తోట లోపలకు వెళ్లారు.

రాత్రి 8 గంటల సమయంలో అమృత తాతయ్య కు ఫోన్ చేసి తల్లి కి హైదరాబాద్ లో చికిత్స చేపించమన్నారని చెప్పింది. సుహాసిని కూడా తన తండ్రి తో మాట్లాడింది. తండ్రి కూడా మీరేం భయపడొద్దని రేపు కార్ వేసుకొని వెళ్లి చూపిఇంచుకుందాం అని దైర్యం చెప్పాడు. సరేనన్నారు. ముగ్గురు కలిసి మామిడి చెట్టుకు నైలాన్ తాళ్ల ను కట్టి స్టూల్ పై నిలబడి మెడకు ఉరి బిగించుకున్నారు.

ముగ్గురు ఒక్కసారిగా కాళ్ళ కింద వున్న స్టూల్ లను తన్నారు. అంతే ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నూరేళ్లు జీవించాలని కన్న కలలన్ని ఆ విగత జీవుల కళ్లల్లో సమాధులయ్యాయి. ఏ ఆశ తీరకుండానే కొడుకు ను ఒంటరిగా వదిలేసి కూతురుతో పాటు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు.

Related posts

జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

Bhavani

జాతీయ అన్వేషిక ప్రయోగాల నైపుణ్య పరీక్షకు నమోదు చేసుకోండి

Satyam NEWS

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

Satyam NEWS

Leave a Comment