29.7 C
Hyderabad
April 29, 2024 07: 42 AM
Slider ప్రత్యేకం

దీపావళి కానుకగా రైతుకు ఒకే రోజు మూడు పధకాలు

#suryakumariIAS

ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అందిస్తున్న  వై.ఎస్.ఆర్ రైతు భరోసా  రెండవ విడత పెట్టుబడి  సహాయం, లక్ష రూపాయల లోపు పంట రుణాలను  సకాలం లో తిరిగి చెల్లించిన వారికి  వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ క్రింద రాయితీ,  వై.ఎస్.ఆర్.యంత్ర సేవ పధకం  అందజేసే సబ్సిడీ ని రైతు గ్రూప్ల ఖాతాల్లో  ల్లో జమ చేసే  బృహత్తర కార్యక్రమాన్ని సీఎం జ‌గ‌న్  వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు ను జమ చేసారు. ఈ సంద‌ర్భంగా  విజ‌య‌న‌గ‌రం జిల్లా కలక్టరేట్  నుండి  కలెక్టర్ ఎ.సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా. కిషోర్ కుమార్, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్సీ డా.సురేష్ బాబు,  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి,  బొత్స అప్పల నరసయ్య, శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, బడ్డుకొండ అప్పల నాయుడు,  జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వాకాడ  నాగేశ్వర రావు, డి.సి.ఎం.ఎస్ ఛైర్పర్సన్ డా. భావన , వ్యవసాయ శాఖ జే.డి రామ రావు, పశు సంవర్ధక, ఉద్యాన వన శాఖల  డి.డి లు. ఎ.డి లు, రైతులు పాల్గొన్నారు.  ఈ వీడియో కాన్ఫెరెన్సును ప్రతీ రైతు బరోసా కేంద్రంలో రైతులు, వ్యవసాయాధికారులు లైవ్ ద్వారా వీక్షించారు.   వీడియో కాన్ఫెరెన్సు అనంతరం రైతులకు చెక్కును అందజేసారు.

జిల్లాలో 3.2 లక్షల మంది రైతులకు  మూడు ప‌థ‌కాల ద్వారా 127.33 కోట్ల  జమ

విజయనగరం జిల్లాలో వై.ఎస్.ఆర్ రైతు భరోసా  పి.ఎం.కిసాన్ మూడవ ఏడాది రెండవ విడత క్రింద ప్రతి కుటుంబానికి 4 వేల రూపాయలు చొప్పున  2 లక్షల 88 వేల మంది రైతులకు 120.46 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి తెలిపారు.  అదే విధంగా  లక్ష రూపాయల లోపు పంట రుణాలను తీసుకొని  సకాలం లో తిరిగి చెల్లించిన  33 వేల 524 మంది రైతులకు 5.14 కోట్ల రూపాయల ను  వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ క్రింద రాయితీ ణి అందజేయడం జరిగిందన్నారు. 

వై.ఎస్.ఆర్.యంత్ర సేవ పధకం  క్రింద  125 రైతు గ్రూప్ ల్లో నున్న 625 మంది రైతులకు 1.73 కోట్ల రూపాయ సబ్సిడీ ని  రైతు గ్రూప్ల ఖాతాల్లో  జమ చేయడం జరిగిందన్నారు. మొత్తం మూడు పధకాల కు సంబంధించి 32.21 లక్షల మంది రైతులకు రూ.127.33 కోట్ల  జమచేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే అధికంగా అందించడం జరిగిందని,  పంట వేసే ప్రతి రైతు  రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని, అదే విధంగా  వారి వేలు ముద్రలు వేసి ఈకేవైసి  కూడా చేయించుకోవాలని అన్నారు.  ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని,  ఈకేవైసి చేయించని రైతులకు ఎలాంటి పధకాలు వర్తించవని తెలిపారు.  ఏ పంట వేసిన  ఈ క్రాప్ నమోదు  తప్పనిసరి అని స్పష్టం చేసారు.

Related posts

విధులకు గైర్హాజరు… అయితే రిజిస్టర్లో మాత్రం సంతకాలు

Satyam NEWS

ఇన్విటేషన్: మేడారం జాతరకు తరలి రండి

Satyam NEWS

ఘనంగా బిజెపి పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవాలు

Satyam NEWS

Leave a Comment