42.2 C
Hyderabad
April 26, 2024 16: 55 PM
Slider సినిమా

బాపు గారి బొమ్మ :ఘనంగా గా హీరోయిన్ ప్ర‌ణీత వివాహాం

tollywood heroine pranitha subhash married a business men in benguloor


బొంగరాల్లాంటి కళ్ళు తిప్పి..ఉంగరాలున్న జుట్టు తిప్పి .ఆ బాపు గారి బొమ్మ ,మల్లెపూల కొమ్మ… గింగిరాలెత్తే నడుమొంపుల్లో ఓ బిజినెస్మెన్ ను చుట్టేసి ఓల్డ్ మోంక్ రమ్ము ల అతన్ని తన మత్తు కళ్ళతో పడేసి పెళ్లి పీటల దాకా తీసుకు వచ్చింది కత్తులులేని యుద్ధం చేసి అతని మనసును గెలిచింది..మూడుముళ్లు ఏడడుగులతో అందాల ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్‌ తన కిష్టమైన వ్యక్తి తో సోమవారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ రాజును హీరోయిన్ ప్ర‌ణీత మనువాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ అత్యంత తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రణీత-నితిన్‌ల వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

‘ఏం పిల్లో ఏం పిల్లడో’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగిడిన ఈ కన్నడ కస్తూరి అనతికాలంలో పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి బడా హీరోల ప్రక్కన నటించారు. పవన్‌ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది, మహేష్‌తో బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్‌తో రభస, రామ్‌తో హలో గురు ప్రేమ కోసమే తో పాటు బావ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హంగామా-2లో నటిస్తున్నారు..

Related posts

పోలీసు సంక్షేమానికే ఐఓసీఎల్ పెట్రోల్ బంకు నిర్మాణం

Satyam NEWS

లౌకిక వాదానికి ప్రతీకగా భారత రాజ్యాంగం…!

Bhavani

ధర్మపురిలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం

Satyam NEWS

Leave a Comment