37.2 C
Hyderabad
May 2, 2024 12: 26 PM
Slider విజయనగరం

ఆ మూడుగంట‌లు ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ట్రాపిక్ క్లియ‌ర్…..!

#trafficpolice

స‌త్యం న్యూస్.నెట్ కెమారాకు చిక్కిన దృశ్యం….! అందుకు కార‌ణం ఎవ్వ‌రో తెలుసా….!

విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద అను నిత్యం ట్రాఫిక్ జామే జ‌రుగుతునే ఉంది.అటు ప్యాసింజ‌ర్స్ కోసం వ‌రుస పెట్టి ఆటోలు ఆర్టీసీ కాంప్లెక్స్ రెండు గేట్లు వ‌ద్ద పెట్టేయ‌డం మ‌రో వైపు ఐమాన్స్ వ‌ద్ద సెవ‌న్ సీట‌ర్స్ వెహికిల్స్ లైన్ గా పెట్టేయ‌డంతో ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద జంక్ష‌న్ లో ర‌ద్దీ కూడా అధిక‌మ‌వ‌డంతో అటు ప్రయాణీకుల‌తో పాటుఇటు ఆ ప్రాంతవాసుల‌తో పాటు క‌లెక్ట‌రేట్ కు, ఇటు రైల్వే స్టేష‌న్ కు మ‌రోవైపు గంట‌స్థంబం,బాలాజీ సెంట‌ర్ల వైపు వెళ్లందుకు ప్ర‌జ‌లు త‌గ క‌ష్టాలు ప‌డుతున్నారు.

ఇక నామ మాత్రంగా కాంప్లెక్స్ ఇన్,అవుట్ గేట్ ల వ‌ద్ద ఇద్ద‌రు ట్రాపిక్ కానిస్టేబుళ్ల ను పెట్టినా…ఆటోలు,సెవ‌న్ సీట‌ర్స్ దాంతోపాటు ట్యాక్సీ స్టాండ్ ను నియంత్రించ‌డం ట్రాఫిక్ పోలీసుల‌కు  క‌ష్ట సాధ్యంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ దీపికా…ట్రాఫిక్ సిబ్బంది త‌క్కువ‌గా ఉన్నార‌ని గ్ర‌హించే  అద‌నంగా ఏఆర్ సిబ్బంది ప‌దిమందిని ట్రాఫిక్ కు కేటాయించారు. దీంతో ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఏఆర్ సిబ్బంది కూడా ట్రాఫిక్ ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్దీక‌రించే పనిలో ప‌డ్డారు.ఈ క్ర‌మంలోనే స‌త్యం న్యూస్.నెట్ కెమారాకు..ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ఆటో డ్రైవ‌ర్ల‌కు, సెవ‌న్ సీట‌ర్స్ డ్రైవ‌ర్ల‌కు ట్రాఫిక్ ఎస్ఐ భాస్క‌రావు క్లాస్ తీసుకోవ‌డం క‌నిపించ‌డంతో వెంట‌నే క్లిక్ మ‌నిపించ‌డంతో పాటు ఏంటా ట్రాఫిక్ ఎస్ఐ తీసుకుంటున్న క్లాస్ అని ద‌గ్గ‌ర‌కువెళ్లి చూసారు.దీంతో

ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద అటు సెవ‌న్ సీట‌ర్స్ ఆటోల‌ను ఇటు  మామూల ఆటోల డ్రైవ‌ర్ల‌కు ట్రాఫిక్ కై చైత‌న్యం క‌లిగించే ప‌ని చేప‌ట్టారు…ట్రాఫిక్ ఎస్ఐ భాస్క‌ర‌రావు, అటు బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద కూడా మ‌రో  ట్రాఫిక్ ఎస్ఐ దామోదార రావు  ట్రాఫిక నిబంద‌న‌ల‌ను ఉల్లంఘించి వారికి చ‌లానా  వేసే ప‌నిలో ప‌డ్డారు.ఈసంద‌ర్బంగా ట్రాపిక్ ఎస్ఐ భాస్క‌ర‌రావు మాట్లాడుతూ కాంప్లెక్స్ వ‌ద్ద ట్రాఫిక్ జామ్ అవ‌డానికి కార‌ణం ఆటో డ్రైవ‌ర్లేన‌ని స్ప‌ష్టం చేసారు. తోట‌పాలం వెళ్లే ర‌హ‌దారికి ఇరువైపుల  ఆటోలు  పెట్టి అటు పాదాచారుల‌కు ఇటు వాహ‌నాల ర‌ద్దీకి  కార‌ణం అవుతున్నార‌న్నారు. మీ బేరాల కోసం…రోడ్డుపైనే ఆటోల‌ను  ఆపితే వెన‌కాల వ‌చ్చే వాహనాలు నిల‌చిపోవ‌డం ప‌ర్య‌వ‌స‌రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంద‌న్నారు. ఇక‌నైనా ప్ర‌యాణీకుల‌ను తీసుకు వెళ్లే క్ర‌మంలో  వెన‌క‌,ముంద‌ర చూసుకుని ప్ర‌ధాన జంక్ష‌న్ ల‌లో నిలుపుదల‌చేయాల‌ని సూచించారు.

Related posts

ప్రొటెస్టు: ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను అమలుచేయనివ్వం

Satyam NEWS

నోటి మాటతోనే నాన్ సెక్రటేరియేట్ సిబ్బంది తరలింపు షురూ

Satyam NEWS

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సత్యవతి

Satyam NEWS

Leave a Comment