38.2 C
Hyderabad
April 29, 2024 20: 30 PM
Slider విజయనగరం

హెల్మెట్లు ధరించడంపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన

#TrafficPolice

ఏపీలో ని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో నగర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు…ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్, సీటు బెల్ట్ ,ముఖానికి మాస్క్ లేని వారిని హెచ్చరికలు చేసి మరీ అలెర్ట్ చేసారు.

కొత్తగా నగర ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు… తన ట్రాఫిక్ ఎస్ఐలీ జీయాయుద్దీన్ ,భాస్కరరావు, హరిబాబు లతో నగర ప్రజలలో అవేర్నస్ కల్పించేయత్నం చేసారు.

ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ఆదేశాలతో ఎస్ఐ భాస్కరరావు…నగరంలో ని న్యూపూర్ణ ట్యాక్సీ స్టాండ్ వద్ద వాహనాలు ఆపి మరీ అవగాహన కల్పించారు.

మరీ ముఖ్యంగా టూవీలర్ పై హెల్మెట్ లేకుండా వెళుతున్న వారిని ఆపి మరీ చైతన్య పరిచారు.

అలాగే పెండింగ్ చలానా జాబాతాను స్మార్ట్ ఫోన్ ద్వారా నే వాహనదారుల ఎదుటే చూపించి.. కట్టకపోవడానికి గల కారణాలను తెలుసుకునే యత్నం చేసారు…ట్రాఫిక్ పోలీసులు.

అయితే అకస్మాత్తుగా ట్రాఫిక్ పోలీసులు తమపై జులుం ప్రదర్శిస్తున్నారని..వాహన దారులు వాపోతున్నారు.

Related posts

డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

Satyam NEWS

ట్రెడిషన్: భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి

Satyam NEWS

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS

Leave a Comment