28.7 C
Hyderabad
April 27, 2024 04: 52 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

#sri kodanda ramalayam

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వేడుక‌గా స్నపనతిరుమంజనం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో పార్వ‌తి, ఏఈవో దుర్గ‌రాజు, ఆగ‌మస‌ల‌హాదారు వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, సూపరింటెండెంట్‌ రమేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు జ‌య‌కుమార్‌, మునిర‌త్నం పాల్గొన్నారు.

Related posts

ద్రౌపది గా వస్తున్న దీపికా పదుకొనే

Satyam NEWS

పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment