38.2 C
Hyderabad
April 29, 2024 19: 22 PM
Slider విజయనగరం

ట్రాఫిక్ పోలీసుల ఆదేశాల‌ను పెడ‌చెవిన పెడుతున్న ప్ర‌జానీకం…!

#Traffic Police Vijayanagaram

దాదాపు ఎనిమిది నెల‌లు పాటు క‌రోనా పుణ్య‌మా  కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్ డౌన్ల ప్ర‌భావంతో   ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్, శానిటైజ‌ర్ ను అల‌వాటు చేసుకున్నారు. కానీ అక్క‌డ‌క్క‌డ కొంతమంది మాస్క్ లు, పెట్టుకోక‌పోవ‌డంతో పాటు  హెల్మెట్లు ధ‌రించ‌క‌పోవ‌డంతో..జ‌రుగుచున్న రోడ్ల ప్ర‌మాదాల‌కు అదే కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు చెబుతున్నారు. 

దీంతో  ఏపీ రాష్ట్రంలో హెల్మెట్ అవేర్న‌స్ వీక్ ను ప్రారంభించింది. ఈ వారోత్స‌వాల‌లో తొలుత ఇండ్ల నుంచీ రోడ్ల‌పైకి వ‌చ్చే వారంద‌రికీ హెల్మెట్ల ద‌రించ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పించే చ‌ర్య‌లు చేపట్టారు…రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు. ఇందులోభాగంగానే రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎస్పీ  ఆదేశాల మేర‌కు ట్రాఫిక్ డీఎస్పీ హెల్మెట్ అవ‌గాహ‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇప్ప‌టికే వ‌రుస పెట్టి అయిదు సార్లు నో హెల్మెట్..నో జ‌ర్నీ అంటూ అవేర్న‌స్ తీసుకు వ‌చ్చిన ట్రాఫిక్ పోలీసులు.. అంత‌టితో స‌రి పెట్ట‌క‌..ప్ర‌ధాన జంక్ష‌న్ ల‌లో హెల్మెట్ ధార‌ణ‌…ప్రాణాల‌కు ర‌క్ష‌ణ అన్న శ్లోగాన్ తో న‌గ‌ర ప్ర‌జ‌ల‌లో మ‌రింత చైత‌న్యం తీసుకు వ‌చ్చే చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇప్ప‌టికే న‌గ‌ర ట్రాఫిక్ సీఐ ఎర్రం నాయుడు…త‌న ఎస్ఐలు…జియాయుద్దీన్,భాస్క‌ర రావు,హ‌రిబాబు,ప్ర‌సాద్ ల‌తో…ఆయా జంక్ష‌న్ ల‌లో ఉంటున్న ఏఏఎస్ లు దాలినాయుడు,నూక‌రాజు,రామ‌కృష్ణ‌లతో హెల్మెట్లు,మాస్క్ లు,ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణ‌ల‌పై న‌గ‌ర ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకు వ‌చ్చే చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇందులో బాగంగా న‌గ‌ర ట్రాపిక్ ఎస్ఐ భాస్క‌ర‌రావు.. గంట‌స్తంభం వ‌ద్ద‌..హెల్మెట్ల ధ‌రించ‌కుండా వాహ‌నాల‌ను న‌డుపుతున్న‌వారిని అలాగే సీటు బెల్ట్ లేకుండా కార్ల‌ను డ్రైవ‌న్ చేస్తున్న వారిని గుర్తించి కాస్సేపు నిలుపుద‌ల చేసి వారికి అవ‌గాహ‌న క‌ల్పించారు.

ఇక నుంచీ  మాస్క్ లేకున్నా..సీటు బెల్ట్ పెట్టుకోక‌పోయినా…500 నుంచీ 1000 వ‌ర‌కు జ‌రీమానా విధిస్తామ‌ని ట్రాఫిక్ పోలీసులు న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నారు.

Related posts

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి

Satyam NEWS

సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలి

Satyam NEWS

చెత్తపలుకు:నువ్వేనా తెలివిగలవాడివి?

Satyam NEWS

Leave a Comment