40.2 C
Hyderabad
April 29, 2024 16: 23 PM
Slider నెల్లూరు

చిన్నారి గోపిక చిరునవ్వు తో నడిచింది

#gopika

దాతలే దేవుళ్ళు, అందరి ఆశీస్సులు తో చిన్నారి గోపిక చిన్నగా చిరునవ్వుతో భూమి మీద పాదం మోపింది… నెల్లూరు జిల్లా…గూడూరు రూరల్ మండలం మంగళపూరు గ్రామంలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం చలిమంట కాచుకుంటూ ప్రమాదవశాత్తు వంటికి నిప్పు అంటు కోవడంతో 7ఏళ్ళ చిన్నారి గుంటపూడి గోపిక తీవ్రగాయాల పాలైంది.

దాంతో 15 రోజులగా గూడూరు లోని డాక్టర్ సీఆర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణమ్మ లు వైద్య పర్యవేక్షణ చేశారు. ఆర్ధికంగా కూడా అవసరం పడటంతో 99TV గూడూరు ప్రతినిధి సాగర్ రెడ్డి గోపిక సోషల్ మీడియా వేదికగా అందరికి సమాచారం అందించారు.

మెస్సేజ్ కి స్పందించిన ఎందరో దాతలు 100 రూపాయల నుండి వేల రూపాయిల వరకు తమ వంతు సాయం గోపికకు అందించారు. దాంతో మెరుగైన వైద్యం కూడా అందింది. దాతలు ఎద్దల నరేంద్ర రెడ్డి, వసంత రెడ్డి మరింత ముందుకు వచ్చి గోపిక కుటుంబానికి శాశ్వత నివాసం ఏర్పాటు చేశారు.

వసతులు లేమితో ఉన్న పూరి గుడిసె స్థానం లో మెరుగు పరిచిన రేకుల ఇంటిని వారు తీర్చిదిద్దారు. దాంతో గోపిక చిరునవ్వుతో కొత్త ఇంటికి చేరుకున్నది. వాకర్ సాయంతో చిన్నగా నడిచి మంగళపూరు చేరింది.

Related posts

నాగాలాండ్‌లో కాల్పులు.. సిట్ విచారణకు సీఎం డిమాండ్

Sub Editor

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు..?

Bhavani

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

Satyam NEWS

Leave a Comment