39.2 C
Hyderabad
April 28, 2024 14: 47 PM
Slider ముఖ్యంశాలు

గిరిజన యూనివర్సిటీ తరగతులు వెంటనే ప్రారంభించాలి

#tribal university

ములుగు జిల్లాలో ఏర్పాటుచేసిన గిరిజన యూనివర్సిటీ తరగతులను వెంటనే ప్రారంభించాలని, యూనివర్సిటీ కోసం భూమిని త్యాగం చేసిన  ప్రేమ్ నగర్  భూ నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ కు చెందిన దళిత గిరిజన భూములు సర్వే నంబర్ 837 గల భూమిలో ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయించారన్నారు. 

భూ కేటాయింపుల్లో భూమిని కోల్పోయిన రైతులకు ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం నందక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు

రైతులు సదరు భూమిని గత నలభై సంవత్సరాల నుండి కాస్తు చేస్తు జీవనం కొనసాగిస్తున్నారని,  గత ఎన్నికల మేనిపిస్టోలో  ఎస్సీ ఎస్టీ లకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ కోసం నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి కాస్తూ చేసుకుంటున్న భూములు లాక్కోవడం సమంజసం కాదని ఆరోపించారు.

యూనివర్సిటీ కోసం కేటాయించిన భూమిలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

నాంపల్లి కోర్టులో హాజరైన మాజీ ఎంపీ కవిత

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు డెటాల్ సబ్బుల పంపిణీ

Satyam NEWS

విజిలెన్స్ అధికారుల పేరుతో విలేకరుల దోపిడీ

Satyam NEWS

Leave a Comment