29.7 C
Hyderabad
May 3, 2024 05: 21 AM
Slider విజయనగరం

చ‌దువే అభివృద్దికి ఏకైక మార్గం

అభివృద్ది చెంద‌డానికి చ‌దువు మాత్ర‌మే ఏకైక మార్గ‌మ‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి పేర్కొన్నారు. క‌ష్ట‌ప‌డితే ఏదైనా సాధించ‌డం సాధ్య‌మేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు, సంఘ సంస్క‌ర్త‌, బాబూ జ‌గ‌జ్జీవ‌న్‌రామ్ లాంటి మ‌హానుభావుల‌ను స్ఫూర్తిగా తీసుకొని, జీవితంలో ఉన్న‌త స్థానానికి చేరుకొనేందుకు యువ‌త‌ కృషి చేయాల‌ని కోరారు. చిర‌స్థాయిగా మ‌న పేరు నిలిచేలా, అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కులుగా మారే స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.  

ఏ రంగంలో ఉన్న‌త స్థానం సాధించాల‌న్నా, దానికి చ‌దువు ఒక్క‌టే ఏకైక మార్గ‌మ‌ని ఆమె పేర్కొన్నారు. చ‌దువు గొప్ప‌ గుర్తింపుని, రాణింపుని ఇస్తుంద‌ని అన్నారు.  ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేయూత‌ను మాత్ర‌మే ఇస్తాయ‌ని,  వాటిని స‌ద్వినియోగం చేసుకొని కృషి చేసిన‌ప్పుడే, అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు.

ముఖ్యంగా బాలిక‌లు ఉన్న‌త చ‌దువుల‌పై దృష్టిపెట్టి, బాలుర‌తో స‌మానంగా పోటీప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఒక కుటుంబంలో త‌ల్లి చ‌దువుకున్న‌ద‌యితే, ఆమె చ‌దువు ఒక త‌రాన్ని నిల‌బెడుతుంద‌ని క‌లెక్ట‌ర్‌ పేర్కొన్నారు.

బాబూజీ జ‌యంతి సంద‌ర్బంగా విద్యార్ధుల‌కు వ్యాస‌ర‌చ‌న పోటీలు

బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, విద్యార్థుల‌కు నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న పోటీలను నిర్వ‌హించింది..సాంఘిక సంక్షేమ శాఖ‌.

ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ లో ఆయ‌న జయంతి సంద‌ర్బంగా పోటీల‌లో గెలుపొందిన విజేత‌ల‌కు ఎమ్మెల్యే,క‌లెక్ట‌ర్లు బ‌హుమ‌తులు అంద‌జేశారు. దాంతో పాటు విద్యార్థుల‌కు జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన చెక్క‌ల‌ను, డ‌ప్పు క‌ళాకారుల‌కు పింఛ‌న్ల‌ను పంపిణీ చేశారు.

బాబూజీ జీవిత చ‌రిత్ర‌ను గురుకుల క‌ళాశాల విద్యార్థిని విజ‌య‌ల‌క్ష్మి చ‌క్కగా వివ‌రించారు. వివిధ ద‌ళిత సంఘాల నాయ‌కులు బ‌స‌వ సూర్య‌నారాయ‌ణ‌, గోక ర‌మేష్‌, గంటాన అప్పారావు, చిన్న బంగార్రాజు మాట్లాడుతూ, జ‌గ‌జ్జీవ‌న్‌రామ్ గొప్ప‌ద‌నాన్ని, త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, సాంఘిక సంక్షేమ‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ కె.సునీల్ రాజ్‌కుమార్‌, ఎస్‌సి కార్పొరేష‌న్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ సుధాక‌ర‌రావు, వివిధ శాఖ‌ల అధికారులు, వ‌స‌తిగృహ సంక్షేమాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పిఎం మెసేజ్: మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

Satyam NEWS

నిరుద్యోగ గిరిజనులకు ములుగులో జాబ్ మేళా

Satyam NEWS

26 ఏళ్ల వయసులో మరణించిన సత్యనాదెళ్ల కుమారుడు

Satyam NEWS

Leave a Comment