37.2 C
Hyderabad
May 2, 2024 13: 13 PM
Slider నల్గొండ

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు

#hujurnagar

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో తాను న్యాయవాది నైనానని,మనకు ఓటు హక్కు కల్పించి,బడుగు బలహీన వర్గాలు చట్ట సభలలో ఉన్నామంటే ఆ మహానుభావుడు చేసిన రిజర్వేషన్లు కారణం అని అన్నారు. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి, లండన్ విశ్వవిద్యాలయం  నుండి డి.ఎస్.సి డాక్టరేట్ పట్టాలను పొంది అరుదైన గౌరవాన్ని సంపాదించారని,న్యాయ, సామాజిక,ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారని అన్నారు.న్యాయవాదిగా, అధ్యాపకుడిగా,ఆర్థిక వేత్తగా పని చేసిన అనంతరం ప్రముఖ భారతీయ న్యాయవాది,ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత,సంఘ సంస్కర్త ఐన అంబేద్కర్ అంటరానితనం,కుల  నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని,స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు బిజెపి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామారాజు,సీనియర్ నాయకులు చింతలపూడి ఉమామహేశ్వర రావు,కన్నె గుండ్ల తిరుమల రావు, సాంబిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాదగలకు మంత్రివర్గంలో స్థానం కావాలి

Satyam NEWS

చైత్రోదయం

Satyam NEWS

మంత్రులకు శుభాకాంక్షలు తెల్పిన ములుగు జడ్పీ చైర్మన్

Satyam NEWS

Leave a Comment