37.2 C
Hyderabad
April 26, 2024 19: 39 PM
Slider విజయనగరం

పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్న హోం గార్డ్స్

#vijayanagarampolice

ఘనంగా 59వ హోంగార్డ్సు ఆవిర్భావన దినోత్సవం

59వ హోంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవం విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, హెూం గార్డు గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో హోంగార్డ్సు ఒక భాగమై పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులును హోంగార్డ్సు నిర్వహిస్తూ, జిల్లా పోలీసుశాఖలో కీలకంగా మారారన్నారు. పోలీసులు నిర్వహించే బందోబస్తులు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ మరియు వివిధ విభాగాల్లో హోంగార్డులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.

హోంగార్డ్సు నిర్వహించే విధులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ నెల వేతనంతో కూడిన 2రోజులు శెలవులు, మహిళా హెూంగార్డు లకు మూడు మాసాలు మెటర్నటీ లీవు, ప్రమాదాల్లోను, విధుల్లోను మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్ గ్రేషియా, మ్యారేజ్ రుణాలు, మెరిట్ స్కాలర్ షిప్ లతో పాటు మరికొన్ని రాయితీలను అందిస్తున్నదన్నారు.

హెంగార్డ్ను తక్కువ వడ్డీలకు రుణాలను మంజూరు చేసేందుకు, వారి ఆర్ధిక అవసరాలకు ఉపయోగపడేందుకు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా జిల్లాలో ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ అన్నారు. అదే విధంగా హోంగార్డ్సుకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి, చర్యలు చేపట్టామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హోంగార్డ్సు మృతిచెందినా లేదా ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్ధిక రాయితీలు వచ్చే అవకాశం లేనంద హోం గార్డ్స్ ఒక్క రోజు వేతనంను ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి లేదా మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’గా అందజేస్తూ, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచామన్నారు.

పోలీసు ఉద్యోగులు కూడా హోం గార్డ్స్ ను ఆర్ధికంగా ఆదుకొనేందుకు తమవంతుగా కొంత మొత్తాన్ని ‘చేయూత’గా అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. హోంగార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరును తీసుకొని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీసుశాఖకు కూడా మంచి కీర్తిని తీసుకొని వచ్చే విధంగా పని చేయాలన్నారు.

రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించి, ప్రజలకు సహాయకారిగా మెలగాల్సిందిగా హోంగార్డులకు జిల్లా ఎస్పీ ఎం. దీపికి పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కొణిజేటి రోశయ్య మృతికి సంతాప సూచకంగా పోలీసు అధికారులు, హెూంగార్డులు కొద్ది సేపు మౌనం పాటించారు. హోంగార్డ్సు పరేడ్ కు పరేడ్ కమాండరుగా ఎం.శివ సంతోష్ వ్యవహరించారు.

రక్తదానం చేసిన హోంగార్డులు

హోం గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 25మంది హోంగార్డ్సు రక్తదానం చేసారు. విజయనగరం పట్టణానికి చెందిన న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 25మంది హోం గార్డ్స్ స్వ చ్ఛందంగా పాల్గొని, రక్తదానం చేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. సత్యన్నారాయణరావు, ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ టి. త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, పీటీసీ డిఎస్పీ పి.వి. అప్పారావు, డిసిఆర్ బి సిఐ బి. వెంకటరావు, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, విజయనగరం వన్ టౌన్ సీఐ జె.మురళి, టూటౌన్ సీఐ లక్ష్మణరావు, సీసీఎస్ సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు ఈశ్వరరావు, నాగేశ్వరరావు, చిరంజీవరావు, రమణ మూర్తి, టివిఆర్ కే కుమార్, మురళికృష్ణ, శ్రీరాం, కమ్యూనికేషన్ ఇన్స్ పెక్టరు చిట్టి, ఎలు, ఆర్ఎస్ఐలు, హెూంగార్డులుమ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ కళాకారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు సతీష్

Satyam NEWS

మానవత్వాన్ని చాటుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

పోలీసులా లేక గులాబీ పార్టీకి ఏజెంట్లా?

Satyam NEWS

Leave a Comment