42.2 C
Hyderabad
May 3, 2024 17: 45 PM
Slider ముఖ్యంశాలు

కనిపించని శత్రువుతో పోరాడిన వీరులు పోలీసులే

#nagarkurnoolpolice

పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీసు లాంఛనాలతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ డాక్టర్ సాయి శేఖర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అదనపు కలెక్టర్ మను చౌదరి నివాళులర్పించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా పాండమిక్ సమయంలో అన్ని శాఖల ఉద్యోగస్తులు ఇంటికే పరిమితమైన సందర్భంలోనూ కనిపించని శత్రువుతో పోరాడే నిలిచిన వ్యక్తులు పోలీసులు అని కలెక్టర్ అన్నారు. వారికి సహకరించిన కుటుంబ సభ్యులకు సైతం కలెక్టర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని కలెక్టర్ ప్రత్యేకంగా నిస్వార్థంతో పనిచేస్తున్న దేశానికే ఆదర్శం అన్నారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రాణాలను సైతం అర్పించిన అమరుల పోలీసులను వారి కుటుంబాలను గుర్తు చేసుకోవడం అక్టోబర్ 21 గొప్ప వేదికగా కలెక్టర్ అభివర్ణించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎల్లవేళలా అహర్నిశలు కృషి చేస్తూ  చేస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.

ఎస్పి డాక్టర్ సాయి శేఖర్ మాట్లాడుతూ భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని ఎలాగయినా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో పక్కనే ఉన్న పక్కన ఉన్న దేశాలు పాకిస్తాన్, అప్గణిస్తాన్ దేశం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మార్చాలని డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విదంగా రాష్ట్రంలో యువత తెలిసీ తెలియక గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని గుర్తు చేశారు. గంజాయి, గుట్కా, గుడుంబా నివారణ కోసం తన పూర్తి సహాయ సహకారాలు ఎక్సైజ్ శాఖకు అందిస్తామని ఎస్పీ సందర్భంగా హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో నిలువరించిన వారికీ పది లక్షల రివార్డు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాను మత్తు పదార్థాలు లేని జిల్లాగా మార్చేందుకు నేటి నుండి కఠోర దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కరోనా నివారణ కోసం మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజలను కాపాడిన సందర్భంలో అదే స్ఫూర్తితో యువతను మత్తు బానిస నుండి విముక్తిలను చేసే బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పోలీసులు అమరుల కుటుంబాల తో అమరులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్పి అనూక్ జై కుమార్, డిఎస్పీ మోహన్ రెడ్డి, అమరవీరుల కుటుంబీకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అవుట  రాజశేఖర్, సత్యం న్యూస్.నెట్

Related posts

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Bhavani

అమెరికాకు వెళ్లిన మంత్రి కేటీఆర్

Sub Editor 2

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోనా

Satyam NEWS

Leave a Comment