29.7 C
Hyderabad
May 6, 2024 04: 25 AM
Slider వరంగల్

అడగకుండానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు

#KusumaJagadeeshwar

పార్టీ పటిష్టతకు కార్యకర్తలు పునరంకితం కావాలని రాబోవు రోజులలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.

ఈ రోజు వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ గృహంలో మండల అధ్యక్షుడు రామాచారి ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన వెంకటాపూర్ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ములుగు జడ్పీ చైర్మన్ , టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

మొదట కార్యకర్తల నుండి స్థానిక క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకున్న ఆయన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలు అందరు సమన్వయంతో ఉంటు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, అడగకుండానే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టిలో చూస్తు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు.

ములుగు జిల్లా ఏర్పాటులో పల్లా రాజేశ్వర్ రెడ్డి ది ప్రధాన భూమిక అని, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీకే ఉందని గ్రామస్థాయిలో ప్రతి ఓటరు ను కలిసి సంక్షేమ పథకాల గురించి వివరించి ఓటు బ్యాంక్ గా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

సభ్యత్వ నమోదు  ప్రతి కార్యకర్త బాధ్యత అని అతి త్వరలో  సభ్యత్వాలను  పూర్తి చేసి పార్టీకి అందజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ఇంచార్జీ జలగం మోహన్ రావు, బుర్ర సమ్మయ్య, పిఎసిఎస్ చైర్మన్ రమేష్, కుమార్, వెంకటాపూర్ సర్పంచ్ అశోక్, నర్ర భద్రయ్య, చంటి భద్రయ్య, లింగాల రమణారెడ్డి ,పెరుక కోటేశ్వర్ రావు, దగ్గు ప్రభాకర్, రాజేందర్ , యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.

కె.మహేందర్, సత్యం న్యూస్

Related posts

స్టోరీ ఆఫ్ కౌన్సిల్: జీవీఎల్ చిలక పలుకులు ఎవరి కోసం?

Satyam NEWS

ఈత సరదా తో వెళితే ముగ్గురి ప్రాణాలు తీసిన పులిగుండాల

Satyam NEWS

కెసిఆర్ వల్లనే సంక్షేమ పథకాలు పొందినం..

Satyam NEWS

Leave a Comment