38.2 C
Hyderabad
April 29, 2024 20: 00 PM
Slider ప్రపంచం

అమెరికా అధ్యక్షుడిపై నెగ్గిన అభిశంసన తీర్మానం

FILE PHOTO: U.S. President Donald Trump meets with former hostage Danny Burch and his family in the Oval Office at the White House

అధికారాంతమున చూడవలె డోనాల్డ్ ట్రంప్ అగచాట్లు…. అన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసన ఎదుర్కొనబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే డోనాల్డ్ ట్రంప్ విచారణను ఎదుర్కొనాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఈ అభిశంసన లో ఆయన చేసిన ఘోరమైన నేరాలు రుజువైతే ఆయన పదవికోల్పోవచ్చు లేదా శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.

డోనాల్డ్ ట్రంప్ అధికారం ఇంకో పది నెలల కాలం మాత్రమే మిగిలి ఉంది. అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో విచారణకు మార్గం ఏర్పడింది. ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు ఆయనపై ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 230 ఓట్లు అభిశంసనకు అనుకూలంగా రాగా 197 ఓట్లు ప్రతి కూలంగా వచ్చాయి. దాంతో తదుపరి చర్యలకు అమెరికా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతున్నది. సెనేట్ లో కూడా అభిశంసన తీర్మానం నెగ్గాల్సి ఉంటుంది.

అక్కడ కూడా ఆమోదం పొందితే డోనాల్డ్ ట్రంప్ విచారణ బోనులో నిలబడాల్సి వస్తుంది. సెనేట్ లో రిపబ్లికన్స్ కు మెజారిటీ ఉంది కానీ రిపబ్లిక్స్ లో ముగ్గురు నేడు డెమోక్రాట్లతో కలిసి అభిశంసనకు అనుకూలంగా ఓట్లు వేసినందున సెనేట్ లో కూడా ట్రంప్ కు టెన్షన్ తప్పదు.

Related posts

[Free|Sample] Men S Health Supplement Virile Male Enhancement Pills

Bhavani

తిరుపతి భూ ఆక్రమణలపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment