28.2 C
Hyderabad
April 30, 2025 06: 41 AM
Slider ఆధ్యాత్మికం

బాసరలో గోదారమ్మకు వైభవంగా గంగా హారతి

godavari

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైన పుణ్యక్షేత్రంలో గోదారమ్మ తల్లికి నిత్యా గంగా హారతి అంగరంగవైవంగా జరిగింది. శ్రీ వేద విద్యా భారతి పీఠం ఆధ్వర్యంలో గోదారమ్మకు అభిషేకం, శివర్చన నిత్య హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం శ్రీ వేద భారతి విద్యా నందగిరి స్వామి చేతుల మీదుగా రష్యా దేశానికి చెందిన భక్తులు ప్రత్యేక గంగా హారతి పూజలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీ వేద విద్యానందగిరి స్వామి మాట్లాడుతూ తరచు అమెరికా లోని శ్రీ వేద భారతి పాఠశాల కు పోయి వచ్చే క్రమంలో అక్కడ చూసి గురువుగా భావించే వారని అన్నారు. అందుకే వారు శిష్యులుగా ఇక్కడ వరకూ వచ్చారని అన్నారు. సునీల్ మీర్ చందాని, మర్ధి షినం రష్యా నుండి వచ్చారని, బాసర గోదావరి నది హారతిలో పాల్గొన్నారని అన్నారు. నిత్య హారతిలో భాగంగా ఋషికన్యలచే నిత్య గంగా హారతి నిర్వహించారు.

సాయంత్రం గోదారమ్మకు నక్షత్ర హారతి, నాగహారతి,కుంభ హారతులు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర గోదావరి నదికి కన్నుల పండుగగా హారతి నిర్వహిస్తున్న దృశ్యం చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు.

Related posts

కలం కార్మికులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS

లెటర్ కాంట్రవర్సీ: నిమ్మగడ్డకు భారీగా భద్రత పెంపు

Satyam NEWS

డివిజనల్ కార్యాలయాలు తరలింపు ఆపాలి: రాజంపేట జిల్లా సాధన సమితి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!