28.7 C
Hyderabad
April 28, 2024 09: 11 AM
Slider ప్రపంచం

సో శాడ్: ఎన్నికల పిచ్చితో అల్లాడుతున్నాడు

#DonaldTrump

కరోనా కాటుతో వందలాది మంది మరణిస్తుంటే అతడికి మాత్రం ఎన్నికల పిచ్చి పట్టుకున్నది. మళ్లీ ఎలా ఎన్నిక కావాలా అనే ఆలోచనతో అతను సతమతం అవుతున్నారు. అతను ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాను మళ్లీ ఎన్నిక అయ్యేందుకు చైనా అడ్డంకులు సృష్టిస్తున్నదని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నాడు.

చైనా కరోనా వైరస్ గురించి ముందే చెప్పి ఉండాల్సిందని, అలా చేయకుండా కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించే వరకూ ఆగి ఆ తర్వాత చెప్పిందని ట్రంప్ అంటున్నారు. అయితే ‘‘నేను చాలా చేయగలను’’ అంటూ ట్రంప్ చైనాను హెచ్చరించారు. చైనాపై ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

తన రాజకీయ ప్రత్యర్థి డెమెక్రటిక్ పార్టీకి చెందిన జో బిడెన్ ను అమెరికా అధ్యక్షుడుగా చేయాలని చైనా భావిస్తున్నదని అందువల్లే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఒక అంతర్జాతీయ వార్తా సంస్థతో అన్నారు.

Related posts

జాన్ ప‌హాడ్ ఉర్సు ఉత్స‌వాల్లో ప్ర‌ముఖులు

Sub Editor

ఎడ్వయిజ్: రోగ నిరోధక శక్తిని పెంచుకోండి

Satyam NEWS

ఈనెల 22న కడపకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ రాక

Satyam NEWS

Leave a Comment