42.2 C
Hyderabad
May 3, 2024 17: 54 PM
Slider హైదరాబాద్

జంట‌న‌గ‌రాల‌లో టీఎస్ఆర్టీసీ హోం డెలీవ‌రీ సేవ‌లు

HOME DELIVERY

టీఎస్ఆర్టీసీ జంట‌న‌గ‌రాల‌లో హోండెలీవ‌రి సేవ‌లను ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ప్రారంభించారు. కార్గో, పార్సిల్ సేవ‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో పార్సిల్ సేవ‌ల‌ను జంట‌న‌గ‌రాల‌లో అందుబాటులోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గురువారం ఖైర‌తాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భ‌వ‌నంలో మంత్రి అజ‌య్ కుమార్ ఈ సేవ‌ల్నిలాంఛ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ టీఆఎస్ఆర్టీసీ ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా కార్గో,పార్సిల్ సేవ‌లు వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. జూన్ 19న ఈ సేవ‌ల‌తో నేటి వ‌ర‌కూ రూ. 11.30 కోట్ల ఆదాయం చేకూరింద‌న్నారు. రానున్న రోజుల్లో రూ. 25 ల‌క్ష‌ల‌కు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. జంట న‌గ‌రాల‌లో పార్సిల్ సేవ‌లు వినియోగించుకునే వారికి మ‌రింత సౌల‌భ్యం కోసం నేరుగా ఇళ్ల వ‌ద్ద‌నుంచే పార్సిల్ సేవ‌ల‌ను అందించే క్ర‌మంలో హోం డెలివీరి సేవ‌ల్ని అందుబాటులోకి తెచ్చామ‌ని మంత్రి పువ్వాడ స్ప‌ష్టం చేశారు.

Related posts

కాగజ్ నగర్ లో ఘనంగా నందమూరి జయంతి

Satyam NEWS

అంబర్ పేట్ లో గోపీనాథ్ ముండే జయంతి

Satyam NEWS

మున్నూరు కాపు పటేల్‌ స్టిక్కర్స్‌ల ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment