40.2 C
Hyderabad
April 28, 2024 16: 31 PM
Slider చిత్తూరు

ఉన్న భవనాలను కూలగొట్టే విధానాన్ని టీటీడీ మానుకోవాలి

#Naveen Kumar Reddy

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కొరకు డి అర్ మహల్ వద్ద దాతల సహకారంతో నిర్మించిన ఒకటవ, రెండవ సత్రాలను కూల్చివేయడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 400 కోట్లతో అచ్యుతం, శ్రీపాదం పేర్లతో నూతన వసతి సముదాయాలను నిర్మించే  ఆలోచనను టీటీడీ ఉపసంరించుని “జూ”పార్క్ రోడ్ లో నిర్మిస్తే తిరుమల వెళ్లే యాత్రికులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

అలాగే డి ఆర్ మహల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు వుండవని, అత్యవసరంగా ఆ పరిసర ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళే అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అతి ఎక్కువ ఎత్తులో భవనాలు నిర్మించాలంటే ఎన్విరానమెంటల్ ఇంపాక్ట్ ఎసెస్ మెంట్, సోషల్ ఇంపాక్ట్ ఎసెస్ మెంట్ అనుమతులు తీసుకున్నారా అని ఆయన టీటీడీ అధికారులను ప్రశ్నించారు.

డి.అర్ మహల్ వద్దగల రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షా కాలంలో ఎలా వర్షపు నీరు ఉంటుందో నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. టీటీడి యాత్రికుల సౌకర్యార్థం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం కానీ డి ఆర్ మహల్ వద్ద వున్న గోవిందరాజ సత్రాల నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు రెగ్యులర్ గా నిర్వహిస్తున్నారని అవసరమైతే సత్రాలలోని రూములను పునర్ నిర్మించి, మరుగు దొడ్లను ఆధునికరిస్తే సామాన్య పేద భక్తులకు అనుకూలంగా వుంటుందన్నారు.

గోవిందరాజ సత్రాలలో నార్త్ ఇండియా తో సహా ఇతర రాష్ట్రాలనుంచి బస్ ల ద్వారా, టెంపో ట్రావెల్స్ వాహనాలలో గుంపులుగా వచ్చే భక్తులు సత్రాల ప్రాంగణంలో వంటలు వండుకొని, భోజనాలు చేసి సత్రాలలోని రూమ్ లలో 10 మందికి పైగా అద్దె చాపలతో పడుకుంటారని అలాంటి వారికి నూతనంగా నిర్మించే వసతి సముదాయాలు ఉపయోగపడవన్నారు. గోవిందరాజ సత్రాల నిర్మాణం చాలా పటిష్టంగా వుందని దానికన్నా ముందు బ్రిటిష్ కాలంలో నిర్మించిన “ఎస్వీ హై స్కూల్” “ఓల్డ్ హుజూర్ ఆఫీస్” లాంటివి ఆనేక భవనాలు తిరుపతిలో చెక్కు చెదరకుండా వున్నాయని తెలిపారు.

అవసరమైతే “చెన్నై ఐఐటీ” నిపుణులచే సత్రాలను పరిశీలించి ప్రత్యామ్నాయంగా మౌలిక సదుపాయాలను కల్పించి శ్రీవారి సొమ్ము వృదా కాకుండా,సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు పునరాలోచన చేయాలన్నారు. గోవిందారాజ స్వామి సత్రాల నిర్మాణంలో ఆ కాలంలో వినియోగించిన అరుదైన కలపతో చేసిన తలపులు,కిటికీలు వెల కట్టలేనివన్నారు.

Related posts

వైసీపీ పాలనలో నేరాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

Satyam NEWS

7 నుంచి 15వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

ప్రతి ఒక్కరు ఈ శ్రమ కార్డ్ చేయించుకోవాలి

Satyam NEWS

Leave a Comment