26.7 C
Hyderabad
April 27, 2024 10: 33 AM
Slider చిత్తూరు

గోవిందుడు కొందరివాడేనా? అందరివాడు కాదా?

#NaveenkumarReddy23

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు చూస్తుంటే డబ్బున్న వాళ్ళకే శ్రీవారి దర్శనం అన్న చందంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

లాక్ డౌన్ సడలింపు తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాన్ని 3 వేల మందితో ప్రారంభించి నేడు సుమారు 17 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒకరికి 10000 రూ దర్శనం, 300 రూ ఆన్ లైన్ దర్శనాలు13 వేల మందికి, ప్రముఖులు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో 500 రూ. దర్శనాలు, తిరుమల అధికారి, చైర్మన్ కార్యాలయం నుంచి సుపథం ద్వారా 300 రూ. దర్శనాలు మాత్రమే ప్రతిరోజు కల్పిస్తున్నారు.

సామాన్య భక్తుల కోసం గతంలో ఇస్తున్న “ఉచిత దర్శనాల” టోకెన్ లను ఎందుకు ప్రవేశ పెట్టడం లేదు అని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే సామాన్య భక్తుల,కొంతమంది స్థానికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు 10 వేల మందికి ఉచిత దర్శనాలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

తిరుపతి అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు నడిచి వెళ్లే 9 కిలోమీటర్ల దూరంలో సుమారు 7.5 కిలోమీటర్లు ప్రస్తుతం కాలి నడకదారి పై ఉన్న సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ లను పగులగొట్టి పునర్నిర్మాణం చేపట్టడంపై పునరాలోచించాలని ఆయన కోరారు.

రిలయన్స్ కంపెనీ దాత ఇస్తున్న25 కోట్ల నిధులను పటిష్టంగా ఉన్న కాలి నడకదారి సిమెంట్ స్లాబ్ లను పగుల కొట్టే బదులు “స్విమ్స్” హాస్పత్రి అభివృద్ధి కోసం వినియోగించేలా ధర్మకర్తల మండలి ఆలోచించాలని ఆయన కోరారు.

దాత సహృదయంతో ఇచ్చిన 25 కోట్ల రూపాయలను భక్తులు మెచ్చే విధంగా పదికాలాల పాటు నిలిచే విధంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప బాగున్న వాటిని కొట్టి కట్టడం”బూడిదలో పోసిన పన్నీరే”నని ఆయన అన్నారు.

Related posts

అధికారం కోసం ఆరాటం: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరాటం

Satyam NEWS

సెంట్రల్ వెస్టా ప్రాజెక్టు అంటే ఏమిటి? వివరాలు ఇవిగో

Satyam NEWS

వెల్ఫేర్ విభాగాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ నర్మద

Satyam NEWS

Leave a Comment