37.2 C
Hyderabad
April 30, 2024 14: 00 PM
Slider ఆదిలాబాద్

రేపు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుం దెబ్బ పిలుపు

#tudumdebba

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం  కొయపొశ గుడంలొ ఆదివాసులపై ఫారెస్ట్ అదికారుల ధమనకాండను తుడుం దెబ్బ తీవ్రంగా ఖండించింది.  అటవీ శాఖ అధికారుల  దాడికి వ్యతిరేకంగా తుడుం దెబ్బ  ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అధ్వర్యంలో మరొక దశ అటవీ పోరాటానికి శ్రీకారం చుడతామని, అన్ని జిల్లాల అటవీ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని తుడుందెబ్బ ప్రకటించింది.

అటవీ సాగుదారులు కొయపొశ గుడెం ఆదివాసీ మహిళలు మొన్ననే ఆదిలాబాదు జిల్లా జైలుకు వెళ్లి వచ్చి నెల రోజులు గడవకముందే మరో సారి అటవీ శాఖ అధికారులు ఆదివాసులపై దాడి చేయడం వెనక ముఖ్యమంత్రి KCR హస్తం ఉందని వారన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ కు  అన్ని రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు ,వామపక్ష పార్టీలు, ప్రజాస్వామిక వాదులు ,కార్మిక కర్షక వర్గాల ప్రజలు ,వాణిజ్య వర్తక చిరు వ్యాపారులు ,అందరు సహకరించాలని తుడుందెబ్బ విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ, మండల,జిల్లా కేంద్రాల్లోనే,ఎక్కడివారు అక్కడే పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఉమ్మడి  అదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు గోడం గణేష్, ఆదివాసీ భారత్ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు గెడం మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, ITDA, డైరెక్టర్ కుర్సెంగా తానాజి, హీరా సుఖ జిల్లా అధ్యక్షులు సిడం రాంకిసన్, జిల్లా ఉపాధ్యక్షుడు కుంర శ్యాంరావు, జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, M.P.T.C కుంర జంగు పటేల్, రాష్ట్ర నాయకులు నైతం రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉయ్క సుదర్శన్, AMS జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, విద్యార్థి సంఘం నాయకులు సలాం వరుణ్, ABM జిల్లా అధ్యక్షురాలు మెస్రం మీనా, AMS డివిజనల్ కమిటీ అధ్యక్షురాలు మెస్రం గంగాదేవి, AMS ఉపాధ్యక్షురాలు మరప జామున బాయి పాల్గొన్నారు.

Related posts

సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం

Satyam NEWS

అన్ని ఆలయాలకు పూర్తి భద్రత కల్పిస్తాం

Satyam NEWS

ప్రతిభ చూపిన గిరిజన గురుకుల విద్యార్ధులకు సన్మానం

Satyam NEWS

Leave a Comment