29.2 C
Hyderabad
October 10, 2024 20: 08 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

టీవీ9 అన్‌సంగ్ హీరోస్ అవార్డ్స్ దరఖాస్తులకు ఆహ్వానం

tv9 logo

మన చుట్టూ ఎంతో మంది రియల్ హీరోలుంటారు. ఆయా పరిస్థితుల్లో మాత్రమే తమ ధైర్యాన్ని తెగువను చూపిస్తుంటారు. వీరు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎదుటివారిని రక్షిస్తారు. అలాగే మరికొంతమంది సమాజం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఇలాంటి రియల్ హీరోలను ఎవరూ గుర్తించక పోవచ్చు. కానీ తెలుగు మీడియా చరిత్రలో టీవీ9 తొలిసారిగా ఇటువంటి అరుదైన గౌరవాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అద్భుతమైన ప్రతిభను కనబరిచే అసలైన హీరోలను గుర్తించడమే కాకుండా వీరు చేసే గొప్ప పనులను కోట్లాది మందికి తెలియజేసేందుకు టీవీ9 నిర్ణయించింది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న మట్టిలో మాణిక్యాలను టీవీ9 సగర్వంగా సత్కరిస్తుంది. ఇటువంటి వారికి అన్ సంగ్ హీరోస్ పేరుతో ప్రత్యేకమైన అవార్డులను కూడా ఇవ్వనుంది టీవీ9.  సమాజంలో ఉన్న ఎంతో మంది అసలు సిసలైన సామాన్య హీరోలను గుర్తించి వారికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహించాలని టీవీ9 నిర్ణయించింది. డిసెంబర్ మూడో వారంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉదాహరణకు కచ్చలూరు బోటు ప్రమాదానికి గురైనప్పుడు బాధితుల్లో కొందరిని రక్షించిన హీరోలలో ఒకరు. అదే విధంగా విశాఖ జిల్లాలో గుర్రం పై స్కూలుకు వెళ్లి మరీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు. ఇలా పలు రంగాల్లో సేవలు, సాహసాలు చేస్తూ పది మందికి ఆదర్శవంతంగా ఉన్నవారిని గుర్తించాలి.  మీకు తెలిసిన వారెవరైనా ఈ విధంగా సమాజ సేవలో నిస్వార్ధంగా భాగస్వాములై ఉంటే వారి గురించి మీ జిల్లాల్లో గల స్ధానిక టీవీ9 ప్రతినిధులను సంప్రదించండి. సేవా కార్యక్రమాలు, సాహసాలకు సంబంధించి టీవీ9 రిపోర్టర్లకు అందించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్ సంగ్ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అక్టోబర్ 21.

Related posts

బాలివుడ్ ఛాన్సు కొట్టేసిన రష్మిక

Satyam NEWS

రాజంపేట టీడీపీ లో పెరుగుతున్న ఆశావహులు

Satyam NEWS

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంయుక్త కథనం క్షీరసాగర మథనం

Satyam NEWS

Leave a Comment