నాగర్ కర్నూలు జిల్లా అచ్చం పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరూ ఊహించని అత్యంత దారుణమైన తప్పిదానికి పాల్పడిన ఇద్దరు ప్రభుత్వ వైద్యులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ సస్పెండ్ చేశారు. ఒక గర్భిణికి డెలివరీ సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో గర్భవతి పేగును కత్తిరించడానికి బదులు గా శిశువు తలను కత్తిరించడంలో ఇద్దరు డాక్టర్ల పొరబాటు ఉన్నట్లు విచారణలో తేలింది.
దాంతో డాక్టర్ తారా సింగ్, డాక్టర్ సుధారాణి లను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడించారు. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి (20) డెలివరీ నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
డ్యూటీ డాక్టర్ సుధారాణి, డాక్టర్ తారా సింగ్ కొద్దిసేపు డెలివరీ కి ప్రయత్నించి తల్లి గర్భంలో పిండం చనిపోయిందని వెంటనే హైదరాబాద్ తీసు పోమ్మని చెప్పారు. దాంతో స్వాతిని బంధువులు హైదరాబాద్ లో చార్మినార్ వద్ద ఉన్న జజ్జి ఖానా హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ వారు మొన్న మధ్యాహ్నం డెలివరీ చేసి తల లేని పాపను బయటికి తీశారు. అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోయి స్వాతి ని ఇక్కడకు తీసుకు రాకముందు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని ప్రశ్నించారు.
వారు వివరాలు చెప్పారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దాంతో స్వాతి డెలివరీలో నిర్లక్ష్యం వహించి తమ పాప చావుకు కారణమైన డాక్టర్లపై చర్య తీసుకోవాలని వారు ఆందోళన చేశారు. జరిగిన సంఘటన పై విచారణ జరిపి డాక్టర్లను సస్పెండ్ చేశారు.