31.7 C
Hyderabad
May 2, 2024 08: 02 AM
Slider కరీంనగర్

తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు

#koppulaeswar

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ లో అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడ బిడ్డలకు చీరల పంపిణీ చేపట్టినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  మండలం గొరెపల్లి గ్రామంలో శుక్ర వారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ చీరలు పంపిణీ చేశారు. ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని.. పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల 50 వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు ఏనాడు ప్రజలు ముఖ్యంగా మహిళల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు .

అంతే కాదు బతుకమ్మ చీరల పంపిణీ వెనుక గొప్ప ఆంతర్యం ఉందన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసిర్ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని సంకల్పించారని మంత్రి కొప్పుల చెప్పారు. నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తూ చేనేత కార్మికుల ఆకలి చావులకు అడ్డుకట్ట వేశామన్నారు. తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు వచ్చిందన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మను ప్రపంచ దేశాలకు తీసుక వెల్లిందన్నారు. ఇది అర్థం చేసుకోలేని వారు పలు రకాల విమర్శలు చేస్తున్నారని విమర్శిస్తున్నారని మంత్రి కొప్పుల విరుచుకు పడ్డారు. ఈ కార్యక్రమమంలో పెద్ధపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ సుజాత రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ సహ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

విప‌క్ష పార్టీల‌కు టీఆర్ఎస్‌ ధీటుగా స‌మాధానం

Sub Editor

రూట్ మ్యాప్: ఇక రాబోతున్నది డిజిటల్ జీవితమే

Satyam NEWS

కరోనా కాలంలో ఇంత తక్కువ కూలి ఇస్తే ఎలా?

Satyam NEWS

Leave a Comment