కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వద్ద నిర్మల్ నుంచి కొత్తిమీర లోడ్ తో కామారెడ్డి వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కామారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కామారెడ్డి పట్టణానికి చెందిన హైమద్ పాషా(26), ఎస్ కె ఇర్ఫాన్ (22) కామారెడ్డి పట్టణంలో కొత్తిమీర వ్యాపారం చేస్తుంటారు. నిర్మల్ నుంచి కొత్తిమీర తీసుకుని తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు
previous post