33.7 C
Hyderabad
April 30, 2024 00: 58 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

#nagarkurnool

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం  శుభకృతనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని  జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్  శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జిల్లా ప్రజలకు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు అభినందనలు తెలిపారు.

ఈ శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, తీపి, చేదు షడ్రుచులు కలగలిపి ఆస్వాదిస్తూ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని  ఆకాంక్షించారు.  ప్రస్తుత తరుణంలో ఎండలు బాగా పెరిగి పోయిందని, ఏ పని ఉన్న ఉదయం 11 గంటల లోపల ముగించుకొని ఇంటికి వచ్చేయాలన్నారు.

11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లరాదని గొడుగులు, నెత్తికి టోపి లు ఉపయోగించాలన్నారు.  క్రమం తప్పకుండా మంచి నీరు తాగుతూ శరీరాన్ని ఎండసోడ తగలకుండా బ్యాలెన్సింగ్ గా ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు పరీక్షల సమయం ఉన్నందున ఆందోళన పడకుండా ధైర్యంగ పరీక్షలు రాసేవిధంగా సన్నద్ధం కావాలని సూచించారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

పోలవరం  ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి

Satyam NEWS

వెంకటగిరి ప్రజలకు ఉచితంగా కృష్ణపట్నం ఆనందయ్య మందు

Satyam NEWS

Leave a Comment