28.7 C
Hyderabad
April 26, 2024 08: 18 AM
Slider ప్రపంచం

రష్యాను చావుదెబ్బ తీసిన ఉక్రెయిన్

#ukraine

గత వారం రోజుల్లో 60 మంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖెర్సన్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిఖల్కా పట్టణంపై ఉక్రేనియన్ సైన్యం కాల్పులు జరిపిందని జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో రష్యన్ సైన్యం వాతావరణ కారణాలతో ఈ నగరాన్ని విడిచిపెడుతున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ చేసిన ఈ వాదనపై రష్యా ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

80 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అధునాతన రాకెట్ వ్యవస్థలను యుక్రెయిన్‌కు యుఎస్ అందించింది. తూర్పు ప్రావిన్స్ లుహాన్స్‌క్‌ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెనిన్యాకోవ్ గ్రామంలో మంగళవారం జరిగిన భారీ కాల్పుల్లో 50 మంది రష్యన్ సైనికులు మరణించారని ఉక్రెయిన్ బుధవారం చెప్పింది. నాలుగు రోజుల్లో, రెండవ సారి, ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం నిజం అయితే రష్యాకు అతి పెద్ద దెబ్బ తగిలినట్లుగా భావించాల్సి ఉంటుంది.

Related posts

ఎకో ప్రెండ్లీ సీడ్‌ గణేష్‌ కిట్టును ఆవిష్కరించిన ఉప్పల్‌ ఎమ్మెల్యే

Satyam NEWS

మహిళలను విద్యావంతులు చేసిన సావిత్రిబాయి పూలే

Satyam NEWS

తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం శీత కన్ను

Satyam NEWS

Leave a Comment